తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు.
తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి విధేయురాలినని, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక తెలిపారు.
పనబాక లక్ష్మీ గురువారం సొంత నియోజకవర్గమైన బాపట్ల విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమెను రైల్వే స్టేషన్లో సమైక్యవాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని అనాలని సమైక్యవాదులు పనబాకపై ఒత్తిడి తెచ్చిన....అందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల భద్రత మధ్య పనబాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు బాపట్లలోని పనబాక నివాసం వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.