'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన' | central government hunts for a seemandhra new capital | Sakshi
Sakshi News home page

'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన'

Published Sun, Feb 23 2014 12:25 PM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన' - Sakshi

'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన'

గుంటూరు : రాష్ట్ర విభజన అంకం ముగిసిన నేపథ్యంలో తాజాగా సీమాంధ్రకు కొత్త రాజధాని ఎక్కడనే దానిపై ఇప్పుడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి మంగళగిరిలోని నాగార్జున యూనివర్శిటీ ప్రాంతాన్ని ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కేంద్రం గోప్యంగా ఉంచుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు.

తాజాగా పనబాక వ్యాఖ్యలతో నాగార్జున వర్శిటీ ప్రాంతంలోనే కొత్త రాజధాని ఏర్పాటు అయ్యే సూచనలకు బలం చేకూర్చుతున్నాయి. మరోవైపు నాగార్జున వర్సిటీని ఒంగోలు పీజీ సెంటర్కు తరలించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పల్నాడులో ఇప్పటికే ఏపీఎస్పీ బెటాలియన్ను కేంద్రం తరలించింది. మరోవైపు కర్నూలును రాజధాని చేయాలని సీమ నేతలు, ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement