ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
విజయవాడ బ్యూరో: ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 150 నుంచి 200 ఎకరాల స్థలం కావాలని హైకోర్టు వర్గాలు ప్రభుత్వాధికారులను కోరినట్లు సమాచారం. గుంటూరు నగరంలో అంత స్థలం దొరికే అవకాశం లేకపోవడంతో నగర శివారు ప్రాంతాలు, నాగార్జున వర్సిటీ వద్ద భూములను పరిశీలిస్తున్నారు.