'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్తోనే మొదలైంది' | panabaka lakshmi takes chandrababu naidu, congress mlas | Sakshi
Sakshi News home page

'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్తోనే మొదలైంది'

Published Mon, Dec 30 2013 12:35 PM | Last Updated on Mon, Oct 22 2018 9:20 PM

'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్తోనే మొదలైంది' - Sakshi

'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్తోనే మొదలైంది'

ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అనకొండ అనటంపై ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు తన రాజకీయ చరిత్ర కాంగ్రెస్తోనే మొదలు అయ్యిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పనబాక లక్ష్మి అన్నారు. మొదట రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి....ఇప్పుడు సమన్యాయం అనటం బాబుకు తగదని ఆమె విమర్శించారు.

పనిలో పనిగా పనబాక సొంతపార్టీ ఎమ్మెల్యేలకు చురకలు వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలక్లోకి తీసుకువెళ్లటంలో ఎమ్మెల్యేలు విఫలం అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లటం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం లాంటిదేనని పనబాక అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement