
నెల్లూరు(దర్గామిట్ట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.రత్నప్రభపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ జనతాదళ్(యు) నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. రత్నప్రభ నామినేషన్ పత్రాల్లో తనపై ఎలాంటి కేసు లేదని పేర్కొన్నారని, అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆమెపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రమణ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు అందించారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలకు రికార్డులు లేవన్నారు. అందువల్ల రత్నప్రభ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.