ratna prabha
-
రత్నప్రభ తీరుపై జన సైనికుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి: ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదు. మీడియాలో అలా ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలియదు’ అంటూ తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వ్యాఖ్యానించడం జనసేన పార్టీలో కాక రేపింది. ఆమె కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న జన సైనికులు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం మంచిదని పవన్‌కు సూచిస్తున్నారు. ఫలితంగా శనివారం తిరుపతిలో నిర్వహించాల్సిన పాదయాత్రను పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. హడావుడిగా రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో తూతూ మంత్రంగా ప్రసంగించి మమ అనిపించారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య ఒప్పందం కుదరడంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కమలం పెద్దల ఒత్తిడితో పవన్ కల్యాణ్ తిరుపతి స్థానాన్ని బీజేపీకి వదిలేశారు. అయినప్పటికీ బీజేపీ నుంచి తమకు పెద్దగా సహకారం ఉండటం లేదని.. తమ మాటకు విలువ ఇవ్వడం లేదని జనసేన నేతలు వాపోతున్నారు. రత్నప్రభ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి వచ్చారు. పాదయాత్ర నిర్వహించకుండా కారులోనే వేగంగా అన్నమయ్య కూడలికి వెళ్లిపోయారు. అభిమానులు వెంట పడటంతో రోడ్ షో చేపట్టారు. అంతకు ముందు జనసేన నాయకులు బీజేపీకి ఇచ్చే మద్దతుపై పునరాలోచించాలని పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కారణంగానే పవన్ ప్రచారంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
తిరుపతి ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థిపై ఫిర్యాదు
నెల్లూరు(దర్గామిట్ట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.రత్నప్రభపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ జనతాదళ్(యు) నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. రత్నప్రభ నామినేషన్ పత్రాల్లో తనపై ఎలాంటి కేసు లేదని పేర్కొన్నారని, అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్స్టేషన్లలో ఆమెపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రమణ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు అందించారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలకు రికార్డులు లేవన్నారు. అందువల్ల రత్నప్రభ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. -
తిరుపతి ఉప ఎన్నిక: అత్యంత సంపన్న అభ్యర్థి ఆమే!
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తనకు మొత్తంగా రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆమె, 2019-20 మధ్యకాలంలో తన ఆదాయం రూ. 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తన తల్లి నుంచి సంక్రమించిన బంగారు ఆభరణాల విలువ రూ. 52 లక్షలు అని తెలిపారు. రత్నప్రభ ఆస్తి వివరాలు ఇలా.. ►మొత్తం ఆస్తి విలువ(భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి)- రూ. 25 కోట్లు ►రత్నప్రభ సొంత ఆస్తులు- రూ. 19.7 కోట్లు ►బ్యాంకు డిపాజిట్ల విలువ- రూ. 2.8 కోట్లు ►బంగారు ఆభరణాల విలువ- రూ. 52 లక్షలు ►చరాస్తుల విలువ- రూ. 3.5 కోట్లు ►భూమి, భవనాలు, ఇళ్ల స్థలాలు, ఇతర స్థిరాస్తుల విలువ- రూ. 16.2 కోట్లు ♦ఇక తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి(భర్త క్రిష్ణయ్యతో కలిసి ఉమ్మడి ఆస్తి) తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు భారీ ఎత్తున స్వతంత్రులు కూడా నామినేషన్ వేశారు. చదవండి: బీజేపీ-జనసేన బంధానికి బీటలు! గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి -
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు
నెల్లూరు (అర్బన్): తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ తరుఫున రత్నప్రభ సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి, తమ పార్టీకి నడుమ జరుగుతోందని, రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రాయలసీమకు నీటి కరువు లేకుండా చేస్తామని చెప్పారు. నామినేషన్ వేసిన సీపీఎం అభ్యర్థి యాదగిరి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సీపీఎం అభ్యర్థి యాదగిరి సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఎం ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందన్నారు. బీజేపీ దుర్మార్గాలన్నింటినీ ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు
తిరుపతి గాంధీరోడ్డు: ప్రత్యేక హోదా అనేదే లేదని.. ఏపీకి అది ఇవ్వడం కుదరదని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి.. ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ తన జన్మభూమి అని.. కర్ణాటక తన కర్మభూమి అని తెలిపారు. తనకు అవకాశమిస్తే రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతానని చెప్పారు. జనసేనకు, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. డబ్బులకు అమ్ముడుపోకుండా ఓటు వేయాలని తిరుపతి ప్రజల్ని కోరారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు, అభివృద్ధికి దగ్గర కావడమే అజెండాగా పనిచేస్తానని చెప్పారు. తిరుపతిలో ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట
న్యూడిల్లీ: ఇందుటెక్ కేసులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందూటెక్ వ్యవహ్యారంలో రత్నప్రభపై సీబీఐ 9వ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెపై అభియోగాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ మోపిన అభియోగాలను గతంలో హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట
-
హైకోర్టులో ఐఏఎస్ అధికారి రత్నప్రభకు ఊరట
హైదరాబాద్: ఇందూటెక్ జోన్ కేసులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టిందని రత్నప్రభ హైకోర్టుకు తెలిపింది. ఇందూటెక్ భూవివాదంలో తన పాత్రేమీలేదంటూ రత్నప్రభ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను అధికారులుగా విధులను నిర్వహించామని రత్నప్రభ కోర్టుకు వెల్లడించింది. నేరపూరిత వ్యక్తులకు, బాధ్యతయుతమైన అధికారుల మధ్య తేడాను సీబీఐ గమనించాలని ఆమె కోర్టుకు తెలిపింది. జగన్ ఆస్తుల కేసులో రత్నప్రభపై సీబీఐ చార్జిషీట్ ను దాఖలు చేశారు. -
సీబీఐ కేసును కొట్టివేయండి: రత్నప్రభ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా సీబీఐ తన పరిధిని దాటి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఆమె శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందూ టెక్ జోన్ కంపెనీకి తాను అనుచిత లబ్ధి చేకూర్చాననే ఆరోపణలతో సీబీఐ తనను నిందితురాలిగా పేర్కొందని, ఇది ఎంతమాత్రం సరికాదని నివేదించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని, వాటిని అమలుచేయడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలో ఇతర ఉన్నతాధికారులను విడిచిపెట్టి తనను మాత్రమే నిందితురాలిగా పేర్కొందని, దీనివెనుక దురుద్దేశాలు ఉన్నట్లు అర్థమవుతోందని ఆ పిటిషన్లో రత్నప్రభ నివేదించారు.