
సాక్షి, చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ఊరందూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామంలో దళితులపై ఆయన అనుచరులు ఆంక్షలు పెట్టారు.
ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే ఓటింగ్‌లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు. టీడీపీ మంత్రి అనుచరులు దళితవాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు. తాము ఓటు వేసి తీరుతామని దళిత ఓటర్లు పేర్కొన్నారు.
చదవండి:
తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్ అప్‌డేట్స్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment