Srikalahasti constituency
-
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ఊరందూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామంలో దళితులపై ఆయన అనుచరులు ఆంక్షలు పెట్టారు. ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే ఓటింగ్‌లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు. టీడీపీ మంత్రి అనుచరులు దళితవాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు. తాము ఓటు వేసి తీరుతామని దళిత ఓటర్లు పేర్కొన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్ అప్డేట్స్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ -
అధికారులపై టీడీపీ నాయకుల కర్రపెత్తనం
నిబంధనలకు విరుద్ధంగా పనులు మాట వినలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బెంబేలెత్తుతున్న అధికారులు శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారులపై టీడీపీ నాయకులు కర్రపెత్తనం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూ రు చేయాలని, బిల్లులు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. మాట వినని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘ప్రభుత్వం మాదేనని, మేము చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని’ బహిరంగంగా హెచ్చరికలకు దిగుతున్నారు. వుూడునెలల క్రితం ఏర్పేడు వుండలంలో ఓ పంచాయుతీ కార్యదర్శి అధికార పార్టీకి చెందిన సర్పంచుల ఒత్తిడిని తట్టుకోలేక తన క్లస్టరును వూర్చాలని ఎంపీడీవోకు విన్నవించుకున్నాడు. ఆయున పట్టించుకోకపోవడంతో వారం రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయూడు. అప్పట్లో ఆయున కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై రాష్ట్రస్థారుు యుూనియున్ నాయుకుల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చే శారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఇటీవల మరింత ఒత్తిడి పెంచారు. ప్రశాంతంగా విధులు నిర్వహించేందుకు వీలుకాక అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రేణిగుంటలోని ఓ అధికారి సెలవుపై వెళ్లగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు వుండలాలకు చెందిన కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులపై ఫిర్యాదుల పర్వం శ్రీకాళహస్తి వుండలంలో కొంతవుంది సర్పంచులకు ఎంపీడీవో సవుుచిత స్థానం, గుర్తింపు ఇవ్వడం లేద ని ఆక్రోశం వెళ్లబుచ్చుతున్నారు. చేసిన పనులకు స కాలంలో బిల్లులు అందకపోవడానికి ప్రభుత్వ విధానాలు కారణవువుతున్నా ఎంపీడీవో కావాలనే ఇలా చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఎంపీడీవో కార్యాలయు ఆవరణలో జరిగిన నవనిర్మా ణ దీక్ష సభలో ఈ వ్యవహారం బహిర్గతమై ఎంపీడీవోపై సర్పంచులు జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేసే స్థారుుకి వెళ్లింది. సవుస్య జఠిలం దృష్ట్యా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలూ చేపట్టకుండా వనం దాల్చడం జెడ్పీ సీఈవో వంతైంది. అలాగే గ్రావూల్లో సైతం పంచాయుతీ కార్యదర్శులు తవుకు అందుబాటులో ఉండడం లేదని, చేసిన పనులకు బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని గతంలో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొం తవుంది సర్పంచులు తావుు ఏకపక్షంగా ఆదేశించిన పనులను చేయులేదన్న అక్కసుతో కార్యదర్శులపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సర్పం చుల ఒత్తిడితో ఎంపీడీవో కార్యదర్శులను ప్రశ్నించడంతో కోపోద్రిక్తులైన కార్యదర్శులు తవు రాష్ట్రస్థారుు యుూనియున్ నాయుకులతో ఎంపీడీవో కార్యాలయుం లో పంచాయుతీ చేసిన విషయుం తెలిసిందే. నియోజకవర్గంలో ప్రధానంగా కాంట్రాక్టు పనులు ఎక్కువగా ఉన్న ఇరిగేషన్, పంచాయుతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ అధికారులకు రాజకీయు ఒత్తిళ్లు తీవ్రస్థారుులో ఎదురవుతున్నారుు. వారికి అండగా నిలవాల్సిన ఆ శాఖల ఉన్నతాధికారులు సవుస్య తలెత్తినప్పుడు జోక్యం చేసుకోకపోవడం వుండల స్థారుు అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. నియోజకవర్గంలో అధికారులపై రాజకీయు కర్రపెత్తనంపై కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. -
మినిస్టర్ హోమ్ మినిస్టర్
*శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంత్రి సతీమణి హల్చల్ *పట్టు కోసం పాకులాట *వచ్చే ఎన్నికల్లో ఆమె అభ్యర్థి అంటూ ప్రచారం ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం ఆయన సతీమణి బృందమ్మదే పెత్తనం. ఆమె అంటే అధికారులందరికీ హడల్. పంచాయితీలు.. ఆస్పత్రులు.. హాస్టళ్లు.. దేవస్థానం.. ఒక్కటని లేదు అన్నింటిలోనూ తలదూర్చుతూ హల్చల్ చేస్తున్నారు. ఆమెకు అడ్డొచ్చే అధికారులు.. పాలకులపై ‘పవర్’ పంచ్‌లేస్తూ పక్కనబెట్టిస్తున్నారు. ఒకప్పుడు గడపదాటి బయటకురాని ఆమె ఇటీవల తనిఖీల పేరుతో తడాఖా చూపిస్తున్నారు. ఈ ‘హోం’ మినిస్టర్ దూకుడు మరెంతకాడికి దారితీస్తుందో వేచిచూడాలి. శ్రీకాళహస్తి : రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పవర్‌తో శ్రీకాళహస్తిలో ఆయన సతీమణి బృందమ్మ పరిపాలన సాగుతోంది. ఆలయంతో పాటు అన్ని శాఖల్లో పట్టుకోసం ఆమె పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బృందమ్మే బరిలో ఉంటారని.. ఆమె సహచరులు బాహాటంగా చెబుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో బిజీబిజీగా ఉంటే, ఆయన సతీమణి ఇక్కడ పరిపాలనలో తలములకలవడం కనిపిస్తోంది. ఒకరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఆలయంతో పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఆదాయ వ్యయూల వివరాలతో పాటు ఉద్యోగస్తుల వివరాలను సేకరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. మంత్రికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన పాల సొసైటీ చైర్మన్ రావిళ్ల మునిరాజానాయుడు.. మంత్రి మాజీ పీఏ రాంబాబునాయుడు ఆమె వెంటే నడుస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంతో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో చిన్నపాటి సమాచారాన్ని సైతం మేడమ్‌కు వారు చేరవేస్తున్నారు. సోమవారం శ్రీకాళహస్తిలో ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు చేశారు. ఆదాయ వ్యయాలతోపాటు ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పడు ఆమె దృష్టికి తీసుకెళుతున్నారు. ఆ ఖాళీల్లో ఆమె తమ అనుచరులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులుగా నియమించేస్తున్నారు. తాజాగా ఆలయంలోని అన్నదానంతో పాటు ఉద్యానవనంలో 20మందికిపైగా టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల్లో నియమించినట్లు సమాచారం. ఇటీవల మద్యం షాపుల వారు మామూళ్లు ఇస్తే సిండికేట్ రూపంలో ఇష్టం వచ్చిన ధరలకు విక్రయాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి అండదండలతోనే పలువురు ఎమ్మార్పీకి కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. పెద్దల హస్తం ఉందని సంబంధిత అధికారులు ఉదాశీన ంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బృందమ్మ ముందుగా పట్టు సంపాదించుకోవడం పదేపదే తనిఖీలు చేయడం... ఖాళీగా ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. రెండు రోజుల క్రితం ఆలయంలో తనిఖీలు చేసిన ఆమె ఇద్దరు ఉద్యోగస్తులను సస్పెండ్ చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చిన్న చిన్న పనులు (రంగులు, సున్నం, పందేళ్లు తదితర) సైతం రూ.1.5కోట్లతో టీడీపీ కార్యకర్తలకే దక్కేలా ఆమె సహకరించినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి.. స్కిట్ కళాశాల, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో బృందమ్మ తనిఖీలు జోరుగా సాగాయి. ఏ అధికారంతో ఆమె తనిఖీలు చేస్తున్నారు ? ఉద్యోగులను సస్పెండ్ చేరుుస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. అయితే ఆమె అవేమీ పట్టించుకోవడంలేదు. బృందమ్మ ప్రధాన అనుచరుడుగా ఉన్న రావిళ్ల మునిరాజానాయుడు చెప్పిందే శాసనంగా పలుచోట్ల నడుస్తోంది. మరో అనుచరుడు రాంబాబు నాయుడు తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆయన బావమరిది చెంచయ్య నాయుడుకు ఆమె ఆశీస్సులతోనే కట్టబెట్టారు. మొత్తం మీద శ్రీకాళహస్తిలో పెత్తనం ఆమె గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం గోపాలన్న కన్నా బృందమ్మే మిన్న అంటూ.. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. పెద్దాస్పత్రిలో బృందమ్మ తనిఖీ తొట్టంబేడు : శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దాస్పత్రిని వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీవుణి బొజ్జల బృందవ్ము సోవువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్ (ఓటీ), ల్యాబ్, రక్తపరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్లో పరికరాలు తుప్పు పట్టి ఉండటాన్ని గుర్తించి వైద్యులపై వుండిపడ్డారు. ఆస్పత్రిలో రోగుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో సిస్టమ్ పనిచేయుడం లేదని సిబ్బంది చెప్పడంతో వారం రోజుల్లో వురవ్ముతులు చేరుుంచాలని ఆదేశించారు. అనంతరం రక్తపరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీలు చేశారు. షింక్ అధ్వానంగా ఉందని, గది శుభ్రంగా లేదని ల్యాబ్ టెక్నీషియున్పై వుండిపడ్డారు. ఆస్పత్రి నిర్వహణే సక్రవుంగా లేకుంటే ఇక రోగులకు ఎంతవూత్రం వైద్యం అందిస్తారో అర్థవువుతోందని ఆర్ఎంవో, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయపరిపాలన గాడిలో పెట్టడం కోసమే శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనను గాడిలో పెట్టడం కోసమే బొజ్జల బృందమ్మ ఆలయాన్ని పరిశీలన చేసి.. తగు సూచనలు ఇచ్చారు. ఆమె కాదు ఎవరైనా ఆలయంలో తనిఖీలు చేసి సూచనలు ఇవ్వవచ్చు. ప్రధానంగా కాంట్రాక్టర్లు ఇస్తున్న సరుకుల్లో మోసాలు జరుగుతుంటాయి. భక్తులను మోసం చేసి సిబ్బంది దోచుకుంటుంటారు. దీనికితోడు శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. ఆలయంతో పాటు పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, హస్టళ్లు, పాఠశాలలను ఆమె తనిఖీలు చేస్తున్నారు. అందులో తప్పేముంది. - బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాష్ట్ర అటవీశాఖమంత్రి పెత్తనం కోసమే పాకులాట టీడీపీ నాయకులు పెత్తనం కోసమే పాకులాట. అంతేతప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడం కోసంకాదు. ఆమెతో(బృందమ్మ) పాటు వారి అనుచరులను తీసుకుని పోయి మనవాళ్లు అయితే ఓకే.. లేదంటే మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేయడం.. ఆలయంతో పాటు పలుకీలకమైన శాఖలను ఆమె గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం పాకులాడుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో ఉంటే స్థానికంగా ఆమె పట్టుసంపాదించుకోవడం కోసం జోరు తనిఖీలు చేస్తున్నారు. అయినా అధికారం వారిది నాలుగేళ్లు భరించాల్సిందే. - సత్రవాడ మునిరామయ్య, మాజీ ఎమ్మెల్యే పరిపాలించడానికి మంత్రి ఉన్నారు కదా.. ఆమెందుకో? పరిపాలించడానికి ప్రజలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఎంచుకున్నారు. మళ్లీ పరిపాలనను గాడిలో పెట్టడానికి ఆయన సతీమణి బృందమ్మ ఎందుకో అర్థం కావడంలేదు. తనిఖీలు చేసి టెండర్లు.. ఉద్యోగాలు టీడీపీ వాళ్లకు అప్పగించడమే తప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడానికి కాదు. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు ఇప్పించారు. టెండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఒరగబెట్టేది ఏమీలేదు. - డాక్టర్ బత్తెయ్యనాయుడు, పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి -
గోపాలా.. ఏమిటీ గోల?
z భూసేకరణ వివాదం తేలకపోవడంతో పనులను అడ్డుకుంటున్న అధికారులు వివాదాన్ని పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి పెట్టని అటవీశాఖ మంత్రి బొజ్జల సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పూర్తిచేస్తా.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తా’నని ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులను సొంత శాఖ అధికారులే అడ్డకుం టున్నా బొజ్జల చోద్యం చూస్తున్నారు. ఓటు దాటాక బొజ్జల వ్యవహరిస్తున్న తీరుపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని రాపూరు, డక్కిలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో 87,734ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం.. 316 చెరువుల కింద కొత్తగా 23,266 ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.300 కోట్ల వ్యయంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2006లో చేపట్టారు. నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ నుంచి 5.26 టీఎంసీల నీటిని లింక్ కెనాల్ ద్వారా తరలించి.. ఆయకట్టుతోపాటూ 1.11 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, 2.50 లక్షల మంది ప్రజల దాహార్తిని కూడా తీర్చాలని నిర్ణయించారు. ఇందుకు సోమశిల రిజర్వాయర్ నుంచి స్వర్ణముఖి నది వరకూ 111 కిలోమీటర్ల మేర కాలువ తవ్వడానికి అప్పట్లోనే టెండర్లు పిలిచారు. ఈ లింక్ కెనాల్‌కు అవసరమైన ప్రణాళిక సంఘం, అటవీ, హైడ్రలాజికల్ అనుమతులను అప్పట్లోనే తెచ్చారు. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ తవ్వకానికి 1450 ఎకరాల ప్రైవేటు భూమి, 980 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,600 ఎకరాల రిజర్వు ఫారెస్ట్ భూమిని సేకరించాలని అధికారులు తేల్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. అటవీశాఖ భూమిని సేకరించాలంటే అందుకు ప్రతిఫలంగా భూమితోపాటూ, భూసేకరణలో పోయే ప్రతి చెట్టుకూ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా కేటాయించిన భూమిలో అడవి పెంపకానికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠన్మరణంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు గ్రహణం పట్టుకుంది. ఆ హామీ ఏమైనట్టు? ఎన్నికల్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రచారాస్త్రంగా చేసుకన్నారు. ఈ లింక్ కెనాల్‌ను పూర్తిచేయడం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన బొజ్జలకు చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖ దక్కింది. అటవీశాఖ బొజ్జలకు దక్కిందిలే.. ఇక సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు పరుగులెత్తుతాయని శ్రీకాళహస్తి ప్రజలు భావించారు. కానీ.. ప్రజల ఆశలను బొజ్జల అడియాశలు చేశారు. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 190 కంపార్ట్మెంట్లో 640 ఎకరాల అటవీ భూమి స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ తవ్వకానికి అవసరం అవుతుంది. ఆ మేరకు అటవీశాఖకు మరో చోట భూమి చూపించి.. పరిహారం అందిస్తే అనుమతి ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం అటవీశాఖకు మరో ప్రాంతం 640 ఎకరాల భూమిని చూపించలేదు. పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్నీ చెల్లించలేదు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు అటవీశాఖ అధికారులు అడ్డు తగలుతున్నారు. ఇటీవల మూడు పర్యాయాలు పనులను అడ్డుకున్నారు. తాజాగా మంగళవారం ఏర్పేడు మండలం చింతలపాళ్యం, అముడూరుల్లో లింక్ కెనాల్ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. సొంత శాఖ అధికారులే లింక్ కెనాల్ పనులను అడ్డుకుంటున్నా అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నోరుతెరవడం లేదు. వివాదాన్ని తెరదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అటకెక్కించే ఎత్తుగడ..: అటవీ భూవివాదాన్ని సాకుగా చూపి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును అటకెక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు కేటాయించాలని ఆశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈనెల 20న శాసనసభలో 2014-15 బడ్జెట్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడమే అందుకు తార్కాణం. నిధులు కేటాయించని నేపథ్యంలో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌పై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసినట్లు స్పష్టమవుతోంది. అటవీ వివాదాన్ని సాకుగా చూపి ఈ ప్రాజెక్టును అటకెక్కించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.