నిబంధనలకు విరుద్ధంగా పనులు
మాట వినలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బెంబేలెత్తుతున్న అధికారులు
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారులపై టీడీపీ నాయకులు కర్రపెత్తనం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూ రు చేయాలని, బిల్లులు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. మాట వినని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘ప్రభుత్వం మాదేనని, మేము చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని’ బహిరంగంగా హెచ్చరికలకు దిగుతున్నారు. వుూడునెలల క్రితం ఏర్పేడు వుండలంలో ఓ పంచాయుతీ కార్యదర్శి అధికార పార్టీకి చెందిన సర్పంచుల ఒత్తిడిని తట్టుకోలేక తన క్లస్టరును వూర్చాలని ఎంపీడీవోకు విన్నవించుకున్నాడు. ఆయున పట్టించుకోకపోవడంతో వారం రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయూడు. అప్పట్లో ఆయున కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై రాష్ట్రస్థారుు యుూనియున్ నాయుకుల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చే శారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఇటీవల మరింత ఒత్తిడి పెంచారు. ప్రశాంతంగా విధులు నిర్వహించేందుకు వీలుకాక అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రేణిగుంటలోని ఓ అధికారి సెలవుపై వెళ్లగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు వుండలాలకు చెందిన కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అధికారులపై ఫిర్యాదుల పర్వం
శ్రీకాళహస్తి వుండలంలో కొంతవుంది సర్పంచులకు ఎంపీడీవో సవుుచిత స్థానం, గుర్తింపు ఇవ్వడం లేద ని ఆక్రోశం వెళ్లబుచ్చుతున్నారు. చేసిన పనులకు స కాలంలో బిల్లులు అందకపోవడానికి ప్రభుత్వ విధానాలు కారణవువుతున్నా ఎంపీడీవో కావాలనే ఇలా చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఎంపీడీవో కార్యాలయు ఆవరణలో జరిగిన నవనిర్మా ణ దీక్ష సభలో ఈ వ్యవహారం బహిర్గతమై ఎంపీడీవోపై సర్పంచులు జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేసే స్థారుుకి వెళ్లింది. సవుస్య జఠిలం దృష్ట్యా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలూ చేపట్టకుండా వనం దాల్చడం జెడ్పీ సీఈవో వంతైంది. అలాగే గ్రావూల్లో సైతం పంచాయుతీ కార్యదర్శులు తవుకు అందుబాటులో ఉండడం లేదని, చేసిన పనులకు బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని గతంలో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొం తవుంది సర్పంచులు తావుు ఏకపక్షంగా ఆదేశించిన పనులను చేయులేదన్న అక్కసుతో కార్యదర్శులపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సర్పం చుల ఒత్తిడితో ఎంపీడీవో కార్యదర్శులను ప్రశ్నించడంతో కోపోద్రిక్తులైన కార్యదర్శులు తవు రాష్ట్రస్థారుు యుూనియున్ నాయుకులతో ఎంపీడీవో కార్యాలయుం లో పంచాయుతీ చేసిన విషయుం తెలిసిందే. నియోజకవర్గంలో ప్రధానంగా కాంట్రాక్టు పనులు ఎక్కువగా ఉన్న ఇరిగేషన్, పంచాయుతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ అధికారులకు రాజకీయు ఒత్తిళ్లు తీవ్రస్థారుులో ఎదురవుతున్నారుు. వారికి అండగా నిలవాల్సిన ఆ శాఖల ఉన్నతాధికారులు సవుస్య తలెత్తినప్పుడు జోక్యం చేసుకోకపోవడం వుండల స్థారుు అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. నియోజకవర్గంలో అధికారులపై రాజకీయు కర్రపెత్తనంపై కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.