dalith
-
రఘురామరాజు అరెస్ట్ ? బాబుకు దళిత నేతలు వార్నింగ్
-
ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!
జైపూర్: దళితులు,వెనుక బడిన వర్గాలపై అఘాయిత్యాలు.. వివక్షతలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొన్నిచోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్తాన్‌లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్తాన్‌లోని చురులోని రుఖాసర్ గ్రామానికి చెందిన.. 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ని కొంత మంది వ్యక్తులు అతని ఇంటి నుంచి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత.. అదే బాటిల్లో మూత్రవిసర్జన చేసి బాధితుడితో బలవంతంగా తాగించారు. అయితే, వీరిమధ్య పాతకక్ష్యల నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జనవరి 26 న జరిగింది. బాధితుడిని రాత్రి 11ల ప్రాంతంలో.. బలవంతంగా కిడ్నాప్ చేసి పొలాల్లోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మద్యం తాగారు. బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టి, అతనిచేత మూత్రం తాగించారు. వారి ఆధీపత్యం చూపించుకోవడానికి ఇలా క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మేఘ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. ఉమేష్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రతన్‌గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు. Rajasthan | A Dalit man was allegedly abducted, beaten, & forced to drink urine by some men in Churu. Two people have been arrested& other accused will be arrested soon: Jagdish Prasad Bohra, Addl Superintendent of police, Churu The incident took place on Jan 26, police said pic.twitter.com/nWanMTDkoy — ANI (@ANI) January 30, 2022 చదవండి: రాహుల్‌కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి -
దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు
సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఎస్.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు. -
ఎవరీ చన్నీ?
పంజాబ్ సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ తండ్రి హర్సా సింగ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, బ్లాక్ సమితీ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి నుంచి చన్నీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. స్కూల్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్‌లోని గురు గోవింద్‌సింగ్ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత జలంధర్‌లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్య ఉంది. ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్లో బంగారు పతకం సాధించడం విశేషం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో దళితులు అవకాశాలు దక్కడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించి అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. సీఎంను మార్చాలంటూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2018లో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అనుచితమైన మెసేజ్ పంపించినట్లు చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్‌లో ‘మీ టూ’వివాదంలో ఆయన కేంద్ర బిందువుగా మారారు. సదరు ఐఏఎస్ అధికారిణి ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తర్వాత వివాదం పరిష్కారమైందని నాటి సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, ‘మీ టూ’వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జ్యోతిష్యంపై గురి ఎక్కువ... జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవడానికి పూజలు, యాగాలు అధికంగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. 2017లో మంత్రివర్గంలో చేరిన వెంటనే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్‌లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్ అధికారులు మూసివేశారు. అలాగే ఓ జ్యోతిష్యుడి సలహాతో చన్నీ ఖరార్‌లోని తన ఇంటి ప్రాంగణంలో ఏనుగుపై ఊరేగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. – నేషనల్ డెస్క్, సాక్షి సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆఫర్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఆదివారం చెప్పారు. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించానని, సిక్కు నాయకుడే పంజాబ్ సీఎంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. శనివారం రాజీనామా చేసిన అమరీందర్ వారసుడి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. పార్టీ నేత రాహుల్ గాంధీతో శనివారం రాత్రి, ఆదివారం అంబికా సోనితో భేటీ అయ్యారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ పార్టీ పెద్దలు తనను కోరిన మాట నిజమేనని ఆమె మీడియాతో చెప్పారు. కానీ, పంజాబ్‌లో గత 50 ఏళ్లుగా సిక్కు నాయకులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. దేశంలో సిక్కు సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు. -
వీడని దళిత బాలిక కేసు మిస్టరీ.. లైంగికదాడి, హత్యకేసుగా..
సాక్షి, కేతేపల్లి(నల్లగొండ): మండలంలోని కొప్పోలులో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దళిత బాలిక కేసు మిస్టరీ వీడలేదు. బాలిక హత్యకు గురై వారం రోజులు కావొస్తున్నా కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నల్లగొండలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు చదువుతున్న ప్రీతి (17) ఘటన జరగడానికి మూడు రోజుల ముందు గ్రామానికి వచ్చింది. ఈనెల 12న రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిద్రపోయిన బాలిక అర్ధరాత్రి తర్వాత కనిపించలేదు. 13న ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో బాలిక మృతదేహం కనిపించింది. ఆమె మెడచుట్టూ చున్నీ బిగించి లాగిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో కొన్నాళ్లుగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న అదే గ్రామానికి చెందిన యువకుడే ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లి లైంగికదాడి జరిపి హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని పోలీసులు 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఆందోళలు చేశారు. బాలిక దారుణ హత్యకు గురైతే, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నకిరేకల్‌తో పాటు కేతేపల్లిలో ధర్నాలు చేశారు. లైంగికదాడి, హత్యకేసుగా మార్పు.. పోలీసుల విచారణ తీరుపై నిరసనలు వ్యక్తం కావంతో జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును లైంగికదాడి, హత్య కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడంతో ఎస్పీ రంగనాథ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎస్ఐ రామకృష్ణను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు పారదర్శక విచారణకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్, ఏఎïస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. మృతదేహానికి రీపోస్టుమార్టం.. కొప్పోలు గ్రామంలో ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని కేసు దర్యాప్తులో భాగంగా ఏఎస్పీ సతీష్, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో శనివా రం బయటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఈకేసు ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అదుపులో నిందితులు..? బాలిక హత్య ఘటనలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు యువకులకు ప్రమే యం ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన అనుమానిత నిందితుడి ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా సూర్యాపేట మండలానికి చెందిన బ్యాండుమేళం వాయించే మరో ముగ్గురు యు వకులు ఈ ఘటనకు సహకరించినట్లు పోలీ సుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన జరిగిన రెండో రోజే పోలీ సులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాలిక హత్యకు మాత్రమే గురైందా.. లేక సామూహిక లైంగికదాడి కూడా జరి గిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ఊరందూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామంలో దళితులపై ఆయన అనుచరులు ఆంక్షలు పెట్టారు. ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే ఓటింగ్‌లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు. టీడీపీ మంత్రి అనుచరులు దళితవాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు. తాము ఓటు వేసి తీరుతామని దళిత ఓటర్లు పేర్కొన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్ అప్డేట్స్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ -
దళిత యువకుడిపై దాడి చేసి మూత్ర విసర్జన
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతనిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఉదంతం తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. దళిత యువకుడు, అతని స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. కులం పేరుతో ప్రదీప్ దళిత యువయులపై దూషణలకు దిగాడు. (టైలర్ హత్య కేసు: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భార్యే..) అంతేకాకుండా ప్రదీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసివచ్చి దళిత యువకుడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తనపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు ఒంటిపై మూత్ర విసర్జన చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. (క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం) -
ఆ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత సంక్షేమానికి పెట్టని కోటగా పరిస్థితి కొనసాగుతుంటే టీడీపీ నాయకులు భరించలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, చెట్టి ఫాల్గుణలతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. సీఎం జగన్ మాత్రం ఏడాది కాలంలోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆయనలో అంబేద్కరిజం కనిపిస్తోంది. ఈమధ్య టీడీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా అడుగుతారేమోనని అనుకున్నాను. కానీ స్కాం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రులను విడిచిపెట్టాలని రాష్ట్రపతిని కలిశారని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులు బయట పడినప్పుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?’ అంటూ ప్రశ్నించారు. టీడీపీ పాలనలోచంద్రబాబు సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేశారే తప్పా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని, గతంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌గా న్యాయ కోవిదుడైన దళితుడిని నియమిస్తే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే టీడీపీ నేతలు అమరావతిలో వ్యాపారాల కోసం అక్కడ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ) అభివృద్ధి భయం పట్టుకుంది: రాజన్నదొర విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు స్వాగతిస్తున్నామని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఐదేళ్లూ ఉత్తరాంధ్రను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఇప్పుడు సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎంత ఖర్చు చేశారో, తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎంత ఖర్చు చేశామన్నదానిపై చర్చకు సిద్ధమని రాజన్నదొర అన్నారు. టీడీపీ నాయకులకు జగన్మోహన్రెడ్డి అభివృద్ధి మంత్రం భయం పట్టుకుందని అన్నారు. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. శవ రాజకీయం కోసం అర్హత లేని వ్యక్తికి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోని తీసేసారంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో కనీసం గిరిజన సలహా మండలి కూడా నియమించలేదని రాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు గిరిజనుల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదరించారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. బీసీ ,ఎస్సీ ఎస్టీ మహిళలకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గిరిజనులకు భూమి పట్టాలిస్తే ఇప్పడు సీఎం జగన్.. నాలుగింతలు ఎక్కువగా భూమి పట్టాలిచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చింతమనేని వ్యాఖ్యల పై దళిత వర్గాల ఆగ్రహం
-
భగ్గుమన్న దళిత సంఘాలు
సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసుల వేధింపుల కారణంగా దళిత యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దంపతుల ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించాయి.దంపతుల మృతదేహాలతో మంగళగిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో దళితుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు రాత్రి ఏడుగంటల సమయంలో ప్రభుత్వం దిగిరావడంతో బాధితులు ఆందోళన విరమించారు. మంగళగిరి: మండలంలోని నవులూరు గ్రామంలో చోటుచేసుకున్న దళిత యువ దంపతులు మిరియాల వెంకటకిరణ్, హెలీనా ఆత్మహత్యలతో దళితసంఘాలు భగ్గుమన్నాయి. నవులూరు నుంచి మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేం దుకు పోలీసులు ప్రయత్నిచగా స్థానికులతో పాటు దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆత్మహత్యలకు కారణమైన ఇబ్రహీంపట్నం ఎస్ఐ, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీం పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో మధ్యాహ్నం వరకు మృతదేహాలు ఇంటి వద్దనే ఉన్నాయి. యువ దంపతుల ఆత్మహత్య సమాచారం తెలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ అధికారప్రతినిధి పచ్చల శ్యాంబాబు, జిల్లా కార్యదర్శి ఈపూరి ఆదాం, పలువురు నాయకులతో మధ్యాహ్నం ఒకటిన్న గంటల సమయంలో కిరణ్ ఇంటికి వెళ్లారు. కిరణ్ తండ్రి భోరున విలపించి, తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని, తన కొడుకు, కోడలి మృతికి కారణమైన వారికి శిక్షపడేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. మృతదేహాలను ఆటోలో ఉంచి మంగళగిరి వెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు అడ్డం తిరగడంతో పోలీసులు ఆటోను అడ్డుకోలేకపోయారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారికి రెండు వైపులా మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు. మహిళలు, యువకులు చేరుకుని ఆందోళన చేపట్టారు, వారికి మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్సార్ సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఏఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, తహసీల్దార్ వసంతబాబు ఆందోళన విరమించాలని కోరినా కలెక్టర్, ఎస్పీ వచ్చి నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే తాము ఆందోళన విరమిస్తామని, లేదంటే ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తామని మృతుని బంధువులు తేల్చిచెప్పారు. దళిత యువదంపతులు ఆత్మహత్యలకు నిరసనగా గంటల తరబడి మృతదేహాలతో రోడ్డుపై ఆందోళన చేస్తున్నా కూతవేటు దూరంలోనే ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ పట్టించుకోలేదంటే దళితులపై ప్రభుత్వానికి, టీడీపీకి ఉన్న వివక్ష తెలుస్తోందంటూ దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. ఎక్కడో విశాఖపట్నంలో ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే అరగంటలో బయటకు వచ్చి ప్రకటన చేసిన డీజీపీకి యువదళిత దంపతుల ఆత్యహత్యలు కనపడలేదా అని సూటిగా ప్రశ్నించారు. దళితులంటే చంద్రబాబుకు వివక్ష : ఆర్కే తొలి నుంచీ చంద్రబాబుకు దళితులంటే వివక్షని అందుకే దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానిం చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు మంత్రులకు సైతం దళితులంటే చిన్నచూపేనని వారి ప్రకటనలే రుజువు చేశాయన్నారు. సివిల్ పంచాయితీల్లో పోలీసులు తలదూర్చకూడదని చట్టం చెబుతున్నా కిరణ్‌తో అతని భార్యను స్టేషన్‌కు పిలిపించి హింసించి, ప్రామిసరీ నోట్లు, స్టాంపులు, ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్యలకు కారణమైన పోలీసులు, అందుకు కారణమైన ఆరుగురి నిందితులను కఠినంగా శిక్షించి, కిరణ్ కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలు, దళిత, క్రిష్టియన్ సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత దంపతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఎస్పీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, బుర్రముక్క వేణుగోపాలరెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకురాతి రాజేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లవరపు నాగయ్య, నూతక్కి జోసఫ్, ఎస్సీ, ఎస్టీ నాయకులు కారుమంచి రామారావు, వలపర్ల కిషోర్, సీపీఎం నాయకులు జె.వి.రాఘవులు, ఎం.రవి, భాగ్యరాజ్, పిల్లలమర్రి బాలకృష్ణ తదితరులు బాధితులకు అండగా నిలిచారు. ఏమి జరిగిందంటే.. మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామానికి చెందిన మిరియాల వెంకటకిరణ్ (34) విజయవాడలోని ఓ కన్సల్టెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన బొమ్మా రామకృష్ణ, చెల్లి సతీష్, హైదరా బాద్‌కు చెందిన గంగా జగపతి, యోగేష్ ఆ కన్సల్టెంట్ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఆ సంస్థ నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తుంది. మిరియాల వెంకట కిరణ్ పలువురు యువకుల వద్ద డబ్బులు వసూలు చేసి సంస్థకు చెల్లించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెంది న తమ్మిశెట్టి రాజశేఖర్ నుంచి డబ్బు వసూలు చేసిన వెంకటకిరణ్ ఆ మొత్తాన్ని బొమ్మా రామకృష్ణకు చెల్లించారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తమ్మిశెట్టి రాజశేఖర్ ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో వెంకటకిరణ్‌పై చీటింగ్ కేసు పెట్టారు. దీంతో వెంకటకిరణ్ను ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యనారాయణ వేధింపులకు గురిచేయడంతోనే తన కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని వెంకటకిరణ్ తండ్రి సుబ్బారావు ఆరోపించారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి 7 గంటల వరకు హైడ్రామా నడిపిన పోలీసులు, ప్రభుత్వం ఎట్టకేలకు దిగిరాకతప్పలేదు. దంపతుల ఆత్మహత్యలకు కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కుటుంబానికి న్యాయం చేస్తామని తహసీల్దార్ వసంతబాబు, పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మరోమారు పోరాటం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, దళితసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసు
జైపూర్: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ సంస్థ ఒకటి లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజస్తాన్‌లోని ఆల్వార్ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి. రావణులకు కాదు’ అని అన్నారు. దీంతో యోగికి రాజస్తాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు పంపారు. -
బీజేపీ ‘దళిత గోవిందం’ రసాభాసా...!
లక్నో: దేశంలోని దళితవర్గాలకు చేరువయ్యేందుకు రాజకీయపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యధిక ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల పార్టీగా పడిన ముద్రను తొలగించే ప్రయత్నంలోనూ ఆ పార్టీ నిమగ్నమైంది. దళితుల ఆదరాభిమానాలు పొందడంలో వెనకబడిందన్న పలు విశ్లేషణలు, నివేదికల నేపథ్యంలో ఈ వర్గాల మనసు గెలుచుకోవడంపై అధికార బీజేపీ దృష్టిపెట్టింది. దీనికోసం దళితుల ఇళ్లల్లో భోజనం, బస వంటి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని సైతం ప్రారంభించింది. అయితే వివిధ రాష్ట్రాల్లో నేతలు అనుసరిస్తున్న తీరుతో ఇది ఒకింత రసాభాసాగాను తయారైంది. యూపీలో ఓ దళితవాడలోని ఇంటికి చెప్పా పెట్టకుండానే ఓ మంత్రివర్యుడు మందీ మార్భలంతో వాలిపోయాడు. వచ్చిన చిక్కల్లా ఆ ఇంట్లో వండిన భోజనం కాకుండా మినరల్ వాటర్ సహా వడ్డించే వస్తువులు, ఆహారం ఇలా మొత్తం హోటల్ నుంచే తెప్పించి అక్కడ ఆరగించడమే. ఎంపీలు, మంత్రులతో సహా పార్టీ నేతలంతా కనీసం ఒక్కనాడైనా దళితవాడల్లో గడపాలన్న అధినాయకత్వం హుకుంను ఆ మంత్రి ఆ విధంగా అర్థం చేసుకున్నాడన్న మాట. సురేష్ రానా అనే ఈ మంత్రి హఠాత్తుగా రాత్రి 11 గంటల సమయంలో అలీఘర్‌లోని ఓ దళితుడి ఇంట్లో ప్రత్యక్షమై ఇలా ఆభాసుపాలయ్యారు. తమ ప్రమేయం ఏమాత్రం లేకుండానే జరిగిన ఈ తంతును గురించి సదరు గృహస్థు రజనీష్ కుమార్ మీడియా ఎదుట వివరించడంతో ఈ ఉదంతం బయటకొచ్చింది. ఆ ఇంట్లో వండిన పదార్థాలూ తిన్నాననీ, ఆ కుటుంబంతో కలిసి ఉదయం టిఫెన్ కూడా చేశానని చివరకు ఆ మంత్రి సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఒక్క ఘటనతోనే దళిత నివాసాల్లో భోజనం అంకం ముగిసిపోలేదు. దళితులతో మమేకమవ్వడంలో భాగంగా మంత్రులు ‘దోమకాట్ల’కు సైతం గురవుతున్నారంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్ తాజాగా సెలవిచ్చేశారు. దీని నుంచి రాజకీయంగా ఆశించిన ఫలితాలు పొందేందుకు దళితుల ఇళ్లలో రాత్రంతా దోమలతో కుట్టించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ అనుభవం మంచిదనే భావనలో కూడా ఉన్నారని, ఈ పనిలో సంతృప్తి ఉన్నందున ఇది తమను పరిపుష్టం చేస్తుందని వెల్లడించారు. గత నెలలో కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ కొందరు దళితులతో కలిసి అయిదునక్షత్రాల హోటల్లో విందు ఆరగించిన ఫోటోలు సోషల్‌మీడియాలో విస్తృతంగా షేర్ కావడం, దానిపై విమర్శలు రావడం తెలిసిందే. యూపీకే చెందిన మరోమంత్రి రాజేందర్ ప్రతాప్‌సింగ్ దళితులతో కలిసి తినడం ద్వారా వారి ఉద్ధరణకు కృషి చేస్తున్న బీజేపీ నాయకులు శ్రీరాముడితో పోల్చతగినవారంటూ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దళితవర్గాలను కించపరిచేందుకు దోహదపడుతున్నాయంటూ కాషాయపక్ష ఎంపీ ఉదిత్‌రాజ్ తప్పబట్టారు. తాము ఉచ్ఛస్థాయిలో ఉంటే దళితులు అథమస్థాయిలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఉపయోగపడుతోందని ఓ దళితుడిగా తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు స్పష్టంచేశాడు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయకురాలు ఉమాభారతి మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన దళితులతో భోజనం కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రజలతో భోజనం చేసి వారిని పరిశుద్ధులుగా చేయడానికి తానేమి శ్రీరామ భగవాన్ను కానంటూ మరో వివాదానికి తెరలేపారు. విమర్శలు వెళ్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. దళితులే ఢిల్లీలోని తన ఇంటికి వస్తే, వారికి భోజనం పెట్టడంతో తమ ఇంటి వాళ్లు వారి ప్లేట్లు కూడా కడుగుతారంటూ వ్యాఖ్యానించారు. అయితే దళితుల హృదయాలను గెలుచుకోవడానికి బదులు నాయకులు చేష్టలతో ఈ కార్యక్రమం కొన్ని చోట్ల ‘ఫార్స్’గా మారడం పట్ల చివరకు ఆరెస్సెస్ నుంచి కూడా హెచ్చరికలు ఎదుర్కోక తప్పలేదు. కేవలం దళితుల ఇళ్లకు వెళ్లడంతోనే ప్రయోజనం ఉండదని, వారిని బీజేపీ నాయకుల ఇళ్లల్లోకి ఆహ్వానిస్తేనే ఉభయతారకంగా ఉంటుందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా సూచించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పాలనలో ‘దళిత్’ పదం వద్దు
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో దళిత్ అనే పద ప్రయోగం తగదంటూ రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్రం సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్ కాస్ట్ అనే పదానికి బదులుగా దళిత్ అని వాడరాదనీ, షెడ్యూల్డ్ కాస్ట్గానే దాన్ని ఉపయోగించాలని కోరుతూ మార్చి 15, 2018న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ లేఖరాసింది. అన్ని పాలనా వ్యవహారాల్లో, సర్టిఫికెట్లలో, అధికారిక లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో, రాజ్యాంగ పదమైన షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాడాలని ఈ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ లకు ఉద్దేశించిన ఈ లేఖలో మోహన్‌లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జనవరి 15, 2018న ఇచ్చిన తీర్పుని ఉటంకించారు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించని దళిత్ అనే పదాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులనుద్దేశించి వాడకూడదని కూడా ఈ లేఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 1982 ఫిబ్రవరి 10న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాల్లో సదరు వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలనీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ అంశం కింద ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కాస్ట్‌గా గుర్తించారో కూడా పేర్కొనాలని, అంతేకానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదనీ చెప్పిన విషయాన్ని చర్చించింది. మళ్ళీ రెండేళ్ళ తరువాత అంటే 1990 ఆగస్టు 18న సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలను షెడ్యూల్డ్ క్యాస్ట్‌నే వాడాలని సూచించిందని కూడా లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లతో సంప్రదించి, కులాలు, జాతులు, తెగలను, లేదా ఆయా కులాల్లోని సమూహాలను ఆయా ప్రాంతాలను బట్టి రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్‌కి అనుగుణంగా చట్టం ప్రకారం ఆ లిస్ట్లోనికి అదనంగా చేర్చడం లేదంటే తీసివేయడం పార్లమెంటు చేస్తుంది. -
దారుణం : అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి..
సాక్షి, లక్నో: సాధారణ కూలీ.. ఎదుటి వారికి ఏమీ చెప్పలేడు. తనకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అతనో మూగ, చెవిటితో బాధపడే దివ్యాంగుడు. అలాంటి వాడిని దొంగతనం నేరం మోపి చిత్రవధ పెట్టాడు అతని యజమాని. చెప్పుకోలేని విధంగా హింసించాడు. శరీరంలోని అతి సున్నిత భాగాలకు సైతం కరెంట్ షాక్ ఇచ్చి నరకం చూపించాడు. అనంతరం ఎవరీ తెలియకుండా ఊరికి దూరంగా పడేసి వచ్చాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఉత్తరప్రదేశ్‌లోని షహజహనాపూర్కు చెందిన కమలేష్ కుమార్ చెవుడు, మూగతో బాధపడే దలిత దివ్యాంగుడు. ఇతను యోగేష్ వర్మ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. అయితే గత గురువారం పనికి వెళ్లిన కమలేష్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం కొత్తబస్తీ ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అనంతరం మెలుకువ వచ్చి ఇంటికి చేరుకొని యజమాని తనని ఏవిధంగా హింసించాడో కుటుంబ సభ్యులకు తనదైన శైలిలో వివరించాడు. డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా శరీరంలోని సున్నిత భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారని రోదించాడు. స్పృహ తప్పిపడిపోయిన తనను దూరంగా తీసుకువచ్చి పడేశాడని వాపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలేష్ శరీరంపై కాలిన మచ్చలు ఉన్నాయని, అతడిని తీవ్రంగా హింసించారని పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు యజమాని యోగేష్ వర్మపై ఐపీసీ 323తోపాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. -
కాళ్లు మొక్కించి బూట్లు నాకించారు!
అహ్మదాబాద్: ఓ గొడవ విషయమై ప్రశ్నించిన పాపానికి ఓ దళిత వ్యక్తిని దాదాపు 15 మంది పోలీసులు కాళ్లు మొక్కించి, బూట్లు నాకించిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. తాము ఉండే ప్రాంతంలో జరిగిన ఓ గొడవపై ప్రశ్నించినందుకు పోలీస్ కానిస్టేబుల్ వినోద్భాయ్ డిసెంబర్ 28న తనను అరెస్ట్ చేశారని బాధితుడు హర్షద్ జాదవ్(38) ఆరోపించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు తన కులం అడిగారనీ.. తాను దళితుడినని చెప్పడంతో వినోద్భాయ్కు క్షమాపణ చెప్పాలన్నారని, వారు చెప్పినట్లు చేసిన తర్వాత దాదాపు 15 మంది పోలీసులు తమ బూట్లను నాకించారన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం జనవరి 1న స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్‌ను ఘొరావ్ చేసిన తర్వాతే అధికారులు కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. మరోవైపు జాదవ్ ఫిర్యాదుతో కానిస్టేబుల్ వినోద్‌పై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసినట్లు డీసీపీ గిరీశ్ పాండ్యా తెలిపారు. - -
విగ్రహాల తొలగింపుపై ఆందోళన
జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించిన అధికారులు దళిత సంఘాల నేతల నిరసన, ర్యాలీ పంచాయతీ తీర్మానం ద్వారా సమస్య పరిష్కారానికి యత్నం పెనుగొండ: పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాల తొలగింపుపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 14వ తేదీ రాత్రి విప్లవ వీరుడు భగత్‌సింగ్, 15వ తేదీన భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం మాజీ ఉపప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వరుసగా విగ్రహాలు వెలుస్తుండడంతో చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ నుంచి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో నిబంధనలు పాటించి విగ్రహాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ శాఖ, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా సోమవారం మూడు విగ్రహాలను తొలగించారు. దీంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మంగళవారం మహార్యాలీకి పిలుపు నిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి దళిత సంఘాల నాయకులు భారీగా తరలి వచ్చారు. ఉదయం 10 గంటలకు పెనుగొండ కళాశాల సెంటర్ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి, విగ్రహాలు తొలగించిన ప్రాంతంలో అరగంట పాటు బైఠాయించారు. విగ్రహాలు పునరుద్ధరించాలంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు సంయమనం పాటించారు. అనంతరం ర్యాలీగా పంచాయతీ వద్దకు వెళ్లి నినాదాలు చేసి, తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తహసీల్దారు బొడ్డు శ్రీనివాసరావును నిర్బంధించి, సమస్యను పరిష్కరించే వరకూ కదిలేది లేదంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నాయకులతో పోలీసులు చర్చలు నిర్వహించారు. చివరకు పంచాయతీ తీర్మానం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించి, పంచాయతీ అత్యవసర సమావేశం ద్వారా పునఃప్రతిష్ట చేయించాలని పట్టుబట్టడంతో తహసీల్దారు పంచాయతీకి విగ్రహల పునః ప్రతిష్టకు తగు చర్యలు తీసుకోవాలంటూ లేఖను అందించారు. నేడు అత్యవసర సమావేశం పంచాయతీలో చర్చించి తీర్మానించడానికిగాను బుధవారం పెనుగొండ పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్చార్జి కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ తెలిపారు. తీర్మానం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించి వెనుతిరిగారు. ఈ నిరసనలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు డేవిడ్, బీజేపీ దళిత మోర్చా నాయకుడు కోరం ముసలయ్య, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం చంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పిడి మోషే, మాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిర్రే రవి దేవాలు పాల్గొన్నారు. తరలి రావాలి బుధవారం పెనుగొండ పంచాయతీ వద్దకు ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలోని దళితులందరూ తరలి రావాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం చంద్రరావులు పిలుపు నిచ్చారు. పంచాయతీ అత్యవసర సమావేశంలో విగ్రహాల పునఃప్రతిష్టకు తీర్మానం ఆమోదించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.