అహ్మదాబాద్: ఓ గొడవ విషయమై ప్రశ్నించిన పాపానికి ఓ దళిత వ్యక్తిని దాదాపు 15 మంది పోలీసులు కాళ్లు మొక్కించి, బూట్లు నాకించిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. తాము ఉండే ప్రాంతంలో జరిగిన ఓ గొడవపై ప్రశ్నించినందుకు పోలీస్ కానిస్టేబుల్ వినోద్‌భాయ్ డిసెంబర్ 28న తనను అరెస్ట్ చేశారని బాధితుడు హర్షద్ జాదవ్(38) ఆరోపించారు.
స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు తన కులం అడిగారనీ.. తాను దళితుడినని చెప్పడంతో వినోద్‌భాయ్‌కు క్షమాపణ చెప్పాలన్నారని, వారు చెప్పినట్లు చేసిన తర్వాత దాదాపు 15 మంది పోలీసులు తమ బూట్లను నాకించారన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం జనవరి 1న స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్‌ను ఘొరావ్ చేసిన తర్వాతే అధికారులు కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. మరోవైపు జాదవ్ ఫిర్యాదుతో కానిస్టేబుల్ వినోద్‌పై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసినట్లు డీసీపీ గిరీశ్ పాండ్యా తెలిపారు. -
Comments
Please login to add a commentAdd a comment