inhumane event
-
ఫీజు చెల్లించలేదని మంచానికి కట్టేసి..
భోపాల్ : చికిత్స ఫీజు చెల్లించలేదని ఓ వృద్ధుడిని ఆస్పత్రి బెడ్‌పై తాళ్లతో కట్టేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. షజాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్య ఖర్చులు రూ 11,000 చెల్లించనందుకు బాధితుడి కాళ్లు, చేతులను ఆస్పత్రి బెడ్‌కు కట్టేశారని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో చేరేముందు రూ 5000 డిపాజిట్‌గా చెల్లించామని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగడంతో బిల్లు చెల్లించేందుకు తమ వద్ద డబ్బు లేదని బాధితుడి కుమార్తె చెప్పారు. కాగా, రోగి మూర్ఛ వ్యాధితో బాదపడుతుండటంతో తనకు తాను హాని తలపెట్టుకోకుండా మంచానికి కట్టివేశామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో వారి బిల్లును ఆస్పత్రి మాఫీ చేసిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై షజాపూర్ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. చదవండి : కరోనా చికిత్సకు అటువైపు వెళ్లబోము!! -
కాళ్లు మొక్కించి బూట్లు నాకించారు!
అహ్మదాబాద్: ఓ గొడవ విషయమై ప్రశ్నించిన పాపానికి ఓ దళిత వ్యక్తిని దాదాపు 15 మంది పోలీసులు కాళ్లు మొక్కించి, బూట్లు నాకించిన అమానవీయ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. తాము ఉండే ప్రాంతంలో జరిగిన ఓ గొడవపై ప్రశ్నించినందుకు పోలీస్ కానిస్టేబుల్ వినోద్భాయ్ డిసెంబర్ 28న తనను అరెస్ట్ చేశారని బాధితుడు హర్షద్ జాదవ్(38) ఆరోపించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు తన కులం అడిగారనీ.. తాను దళితుడినని చెప్పడంతో వినోద్భాయ్కు క్షమాపణ చెప్పాలన్నారని, వారు చెప్పినట్లు చేసిన తర్వాత దాదాపు 15 మంది పోలీసులు తమ బూట్లను నాకించారన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం జనవరి 1న స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్‌ను ఘొరావ్ చేసిన తర్వాతే అధికారులు కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. మరోవైపు జాదవ్ ఫిర్యాదుతో కానిస్టేబుల్ వినోద్‌పై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసినట్లు డీసీపీ గిరీశ్ పాండ్యా తెలిపారు. - -
శవాన్ని ఈడ్చుకెళ్లిన పోలీసులు
వైశాలి: ఒక అనాథ శవాన్ని పోలీసులే మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలోనిది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ అయ్యి, విస్తృతంగా ప్రచారం లభించడంతో విషయం ఉన్నతాధికారులకు చేరి వీడియోలోని పోలీసులు సస్పెండ్ అయ్యారు. గంగా నదిలో అనాథ శవం ఉందంటూ బుధవారం సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికీ శవాన్ని బయటకు తీయడానికి, తర లించడానికి అవసరమైన సాధనాలు, అంబులెన్సు వంటివి ఏమీ లేకుండానే వచ్చారు. తీరానికి వందల మీటర్ల దూరంలో తమ జీపును నిలిపిన పోలీసులు, మృతదేహం మెడకు తాడు కట్టి అక్కడి వరకు ఈడ్చుకెళ్లారు. కొన్నేళ్ల క్రితం ఇదే వైశాలి జిల్లాలో ఒక గుంపు దాడి చేయగా చనిపోయిన 10 మంది మృతదేహాలను పోలీసులు నదిలోకి విసిరేశారు. ప్రపంచానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. గత నెలలోనే ఒడిశాలో ఓ వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని పది కి.మీ నడవడం, యూపీలో ఒకరు కూతురు మృతదేహాన్ని తరలించడానికి డబ్బుల్లేక బిచ్చమెత్తడం, ఢిల్లీలో మృతదేహాన్ని అద్దె ఇంట్లోకి అనుమతించకపోవడం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.