
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతనిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఉదంతం తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. దళిత యువకుడు, అతని స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. కులం పేరుతో ప్రదీప్ దళిత యువయులపై దూషణలకు దిగాడు. (టైలర్ హత్య కేసు: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భార్యే..)
అంతేకాకుండా ప్రదీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసివచ్చి దళిత యువకుడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తనపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు ఒంటిపై మూత్ర విసర్జన చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. (క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment