assaulting
-
డొమినిక్ పెలికాట్కు 20 ఏళ్ల జైలు
అవిగ్నోన్: తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో ఫ్రాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. భార్యకు మత్తు మందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించడంతోపాటు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ భర్త డొమినిక్ పెలికాట్(72)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో మొత్తం 51 మందిని దోషులుగా ప్రకటించింది. మిగతా 50 మందిలో కొందరికి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలను ఫ్రాన్స్‌లోని అవిగ్నోన్ నగర కోర్టు గురువారం ప్రకటించింది. ఇలాంటి నేరాలకు ఫ్రాన్స్‌లో గరిష్ట జైలు శిక్ష 20 ఏళ్లు కావడం గమనార్హం. రేప్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ కేసు విచారణ మూడు నెలలపాటు సాగింది. ఓ డిపార్టుమెంట్ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే డొమినిక్ పెలికాట్ 2020లో మొదటిసారిగా మహిళలను డ్రెస్ కింది నుంచి ఫొటో తీస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఇతరులతో కలిసి భార్య గిసెలి పెలికాట్‌ను రేప్, ఇతర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు 20 వేల వరకు అతడి కంప్యూటర్ డైవ్లలో కనిపించాయి. వాటిలోని ఫోల్డర్లకు అబ్యూజ్, రేపిస్ట్స్, నైట్ ఎలోన్.. తదితర పేర్లు పెట్టాడు డొమినిక్. దశాబ్దకాలంపాటు ఈ ఘోరం కొనసాగింది. గిసెలిపై మొత్తం 72 మంది అత్యాచారం సహా వేర్వేరు నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీరిలో డొమినిక్ సహా 51 మందిని మాత్రం గుర్తించిన అధికారులు వివిధ నేరాభియోగాలను మోపారు. -
మహిళపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారైన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూఢ్ తహసీల్‌లోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచార ఘటన అక్టోబర్ 21న చోటుచేసుకుంది. రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హిమాలి పాఠక్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. బాధిత మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆమె, ఆమె భర్త వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నారని తెలిపారు.బాధితురాలిని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిన ఎనిమిది మందిలో ఒకరికి చేతులు, ఛాతీపై టాటూలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.బాధిత దంపతులు గూఢ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారన్నారు. వెంటనే తాము ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గూఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ వద్ద ఆ మహిళ, ఆమె భర్త గొడవ పడ్డారని డీఎస్పీ తెలిపారు. అదే ఫౌంటెన్ దగ్గర ఐదుగురు వ్యక్తులు తనపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు గుర్హ్ నివాసి రామ్‌కిషన్ కోరి, దీపక్ కోరి, రవేష్ కుమార్ గుప్తా, రాంపూర్ బఘెలాన్ వాసి సుశీల్ కోరి, రాజేంద్ర కోరి, తరుణ్ కోరి, నైగర్హి వాసి లవకుష్ కోరిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గూఢ్ నివాసి రజనీష్ కోరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.నిందితులు బాధితురాలి భర్తను బందించారని ఎస్పీ సింగ్ తెలిపారు. అలాగే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారన్నారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల వరకూ ఎవరికీ తెలియజేదని, ఇది ఆటవిక రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖ పేరును జంగిల్ రాజ్ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ 18 నుంచి 20 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
జీతం అడిగినందుకు ఉద్యోగిపై యజమాని దాడి
అగర్తలా: తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ సాలరీ ఇవ్వమన్నందుకు ఇనుప రాడ్డు, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలా నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూరజిత్ త్రిపుర అనే వ్యక్తి మఫ్టీ అనే బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ దుకాణం యజమాని సాహా.. గత అక్టోబర్‌కు సంబంధించి సూరజిత్‌కు జీతం ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు పెండింగ్ సాలరీ ఇవ్వాలని సూరజిత్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సాహా.. అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్‌పై ఇనుప రాడ్, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. బాధితుడు సూరజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పశ్చిమ అగర్తలా పోలీసులు. ఈ వీడియోను ట్రైబల్ పార్టీ టిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ మానిక్యా ట్విటర్లో షేర్ చేశారు. దుకాణం యజమాని తీరుపై మండిపడ్డారు. యజమానికిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి -
అన్న కాదు మృగాడు.. గర్భం దాల్చిన బాలిక
మైసూరు(కర్ణాటక): తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఆమె గర్భం దాల్చిన సంఘటన మైసూరు గిరిదర్శిని నగరలో వెలుగుచూసింది. కామాంధుడు వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో 16 ఏళ్ల బాలిక అన్న వినయ్‌కుమార్ వద్ద ఉంటోంది. ఆమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉండగా, అక్కలకు పెళ్లయి వెళ్లిపోయారు. మద్యానికి బానిస అయిన వినయ్‌కుమార్ మద్యం తాగి వచ్చి చెల్లిపై లైంగికదాడికి పాల్పడేవాడు. గత మూడు నెలలుగా ఇలా జరుగుతుండటంతో ప్రస్తుతం బాలిక గర్భవతి అయ్యింది. ఇది తెలిసిన మరో అన్న ఆళనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మృగాన్ని అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. బాలికకు గర్భం, యువకుడు అరెస్టు శివమొగ్గ: మైనర్ బాలికను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కేసులో యువకున్ని అరెస్టు చేశారు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలిక కడుపుతో ఉందని చెప్పారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం బయట పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు. -
దళిత యువకుడిపై దాడి చేసి మూత్ర విసర్జన
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతనిపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఉదంతం తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. దళిత యువకుడు, అతని స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పడుతుండగా, తనికొండన్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. కులం పేరుతో ప్రదీప్ దళిత యువయులపై దూషణలకు దిగాడు. (టైలర్ హత్య కేసు: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భార్యే..) అంతేకాకుండా ప్రదీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసివచ్చి దళిత యువకుడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తనపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు ఒంటిపై మూత్ర విసర్జన చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని, నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. (క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం) -
పోలీసులపై దౌర్జన్యం..ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్
బెంగుళూరు : కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి వేళ బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఫయాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఫయాజ్, అతని స్నేహితులతో కలిసి హెడ్ కానిస్టేబుల్‌పై దాడిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన కారణంగా ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (ఏలూరుకు రానున్న కేంద్ర బృందం) -
బాలికపై అత్యాచారయత్నం...బీజేపీ నేత అరెస్ట్
సాక్షి, చెన్నై: రైల్లో ప్రయాణిస్తున్న ఓబాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురం- చెన్నై ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని చెన్నైకి చెందిన న్యాయవాది కేపీ ప్రేమ్ అనంత్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్లో నిద్రిస్తున్న 10 ఏళ్ల బాలికపై అనంత్ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు లేచి గట్టిగా అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి అనంత్‌ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈరోడ్ రైల్వే పోలీసులు అనంత్‌ను అరెస్టు చేశారు. కేపీ ప్రేమ్ అనంత్ 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేసిన రోజే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. -
దళితునిపై టీడీపీ నేత దౌర్జన్యం
పీసీపల్లి : రోడ్డు మార్జిన్లో తోపుడు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ దళిత యువకునిపై అధికార పార్టీ నేత ఆదివారం సాయంత్రం దౌర్జన్యానికి దిగి ఆ బండికి అడ్డంగా మరో బంకు పెట్టి నానా హడావుడి సృష్టించాడు. ఈ సంఘటన పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్లో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు నీలం అమర్నాథ్ జిల్లా పాలకేంద్రం డైరెక్టర్, మండల టీడీపీ నాయకుడు పులి వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 8 సంవత్సరాలుగా నీలం అమర్నాథ్ రోడ్డు మార్జిన్లో సాయంత్రం సమయంలో ఓ బండిపై టిఫిన్ సెంటరును నిర్వహించుకుంటున్నాడు. అయితే ఆ తోపుడు బండి ఉన్న స్థలం తమదంటూ టీడీపీ నాయకుడు జేసీబీపై బంకును తీసుకువెళ్లి అమర్నాథ్ తోపుడు బండికి అడ్డుగా పెట్టించాడు. ఇదేంటి అని అడిగిన అమర్నా«థ్‌ను కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి దిగాడు. తనకు తోపుడు బండే జీవనాధారమని ఇబ్బందులు పాలు చేస్తే ఆత్మహత్యే శరణ్యం అని వాపోయాడు. అమర్నా«థ్‌ను దూషించడమేకాక అతనిపై దౌర్జన్యానికి దిగడంతో దళితుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అధికార పార్టీ నాయకుని ఆగడాలు అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్ ఇన్చార్జి మురళిని ‘సాక్షి’ వివరణ కోరగా సోమవారం ఈ సంఘటనపై హనుమంతునిపాడు ఎస్సై విచారణ జరుపుతారన్నారు. -
కామెంట్ చేసినందుకు, గుండ్లు గీసి...
బరంపురం: తమ ఊరి యువతులను కామెంట్ చేసిన ఇద్దరు యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతే కాకుండా వారిద్దరికీ గుండ్లు కూడా గీయించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గంజాం జిల్లాలో సంచలనం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిస్సా గంజాం జిల్లాలోని కవిసూర్యనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిండల గ్రామానికి శనివారం సాయంత్రం బయట ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఆ గ్రామ యువతులను కామెంట్ చేయడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులు యువకులను వెంబడించి పట్టుకుని అందరూ చూస్తుండగా గుండ్లు గీయించి విద్యుత్ స్తంభానికి కట్టి సుమారు రెండుగంటల పాటు చితగ్గొట్టారు. సమాచారం అందుకున్న కవిసూర్యనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను రక్షిస్తున్న సమయంలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం గొడవ సద్దుమణిగిన తరువాత పోలీసులు ఇద్దరు యువకులను విడిపించి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే వచ్చిన ఇద్దరు యువకులు వారి వివరాలను తెలపడం లేదు. జరిగిన సంఘటనపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. -
షాకింగ్ సీసీ కెమెరా వీడియో
చండీఘడ్: హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మితిమీరిన ఆవేశంలో నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. నిస్సహాయుడిని చేసి బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కిందపడిపోయిన అతనిపై మూత్రం పోసి హేయంగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు ఏడు నిమిషాలు పాటు వీరి అకృత్యం కొనసాగింది. బీడీ అడిగిన పాపానికి అతడిని దారుణంగా హింసించి, అవమానించినట్టు తెలుస్తోంది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. -
'ఉద్యోగులను కొట్టడం పెద్ద నేరమేమీకాదు'
పణజి: ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ గుర్తే! అసలు దోషుల్ని వదిలేసి తప్పంతా సదరు అధికారిదేనని మంత్రులు తీర్మానించగా, సీఎం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినవచ్చాయి. ఏపీని ఆదర్శంగా తీసుకుందో ఏమోగానీ.. ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, వారిపై దాడులకు దిగడం లాంటివి పెద్ద నేరమేమీకాదని గోవా ప్రభుత్వం తీర్మానించింది. ఇక్కడి లాగే అక్కడ కూడా ఓ 'అవినీతి' ఎమ్మెల్యేను కాపాడుకోవడానికే ఈ తతంగమంతా నడిచింది. తమ చర్యను సమర్థించుకుంటూ గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌడా ఇలా అన్నారు.. 'ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెద్ద నేరమేమీకాదు. ప్రస్తుతం మనం సంస్కరణల యుగంలో ఉన్నాం. హింస కంటే సంస్కరణ ద్వారానే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. న్యాయశాస్త్రం కూడా దీనిని సమర్థిస్తుంది. హింస లేదా శిక్షలతో సాధించేది ఏమీ ఉండదు. ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసంరం ఉంది' అంటూ పూర్తిచేశారు డిసౌజా. ఇంతా చేసింది ఎవరికోసమంటే.. బీజేపీ మిత్రపక్షమైన గోవా వికాస్ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే పచేకో కోసం. 2006లో ఓ ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్న పచేకో.. న్యాయస్థానంలో దోషిగా నిరూపణ కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదికూడా ఆరు నెలల శిక్ష మాత్రమే. కాగా, ఎలాగైనాసరే ఆయనను జైలు నుంచి విడుదల చేయించాల్సిందేనని కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వం.. పచేకో చేసింది కేవలం 'పొరపాటు మాత్రమే' అని తీర్మానించి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. -
టీచర్‌ను చితకబాదిన గ్రామస్తులు
నల్గొండ : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు చితకబాదారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అట్లూరులో జడ్పీ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయుడు... విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో విసిగిపోయిన వారు... విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.