బరంపురం: తమ ఊరి యువతులను కామెంట్ చేసిన ఇద్దరు యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతే కాకుండా వారిద్దరికీ గుండ్లు కూడా గీయించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గంజాం జిల్లాలో సంచలనం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిస్సా గంజాం జిల్లాలోని కవిసూర్యనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిండల గ్రామానికి శనివారం సాయంత్రం బయట ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఆ గ్రామ యువతులను కామెంట్ చేయడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు.
దీంతో గ్రామస్తులు యువకులను వెంబడించి పట్టుకుని అందరూ చూస్తుండగా గుండ్లు గీయించి విద్యుత్ స్తంభానికి కట్టి సుమారు రెండుగంటల పాటు చితగ్గొట్టారు. సమాచారం అందుకున్న కవిసూర్యనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను రక్షిస్తున్న సమయంలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం గొడవ సద్దుమణిగిన తరువాత పోలీసులు ఇద్దరు యువకులను విడిపించి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే వచ్చిన ఇద్దరు యువకులు వారి వివరాలను తెలపడం లేదు. జరిగిన సంఘటనపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
కామెంట్ చేసినందుకు, గుండ్లు గీసి...
Published Sun, Jul 30 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM
Advertisement
Advertisement