మహిళపై 72 మంది రేప్ కేసులో మాజీ భర్తే దోషి అన్న కోర్టు
అవిగ్నోన్: తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో ఫ్రాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. భార్యకు మత్తు మందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించడంతోపాటు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ భర్త డొమినిక్ పెలికాట్(72)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో మొత్తం 51 మందిని దోషులుగా ప్రకటించింది. మిగతా 50 మందిలో కొందరికి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలను ఫ్రాన్స్‌లోని అవిగ్నోన్ నగర కోర్టు గురువారం ప్రకటించింది.
ఇలాంటి నేరాలకు ఫ్రాన్స్‌లో గరిష్ట జైలు శిక్ష 20 ఏళ్లు కావడం గమనార్హం. రేప్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ కేసు విచారణ మూడు నెలలపాటు సాగింది. ఓ డిపార్టుమెంట్ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే డొమినిక్ పెలికాట్ 2020లో మొదటిసారిగా మహిళలను డ్రెస్ కింది నుంచి ఫొటో తీస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.
ఇతరులతో కలిసి భార్య గిసెలి పెలికాట్‌ను రేప్, ఇతర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు 20 వేల వరకు అతడి కంప్యూటర్ డైవ్‌లలో కనిపించాయి. వాటిలోని ఫోల్డర్లకు అబ్యూజ్, రేపిస్ట్స్, నైట్ ఎలోన్.. తదితర పేర్లు పెట్టాడు డొమినిక్. దశాబ్దకాలంపాటు ఈ ఘోరం కొనసాగింది. గిసెలిపై మొత్తం 72 మంది అత్యాచారం సహా వేర్వేరు నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీరిలో డొమినిక్ సహా 51 మందిని మాత్రం గుర్తించిన అధికారులు వివిధ నేరాభియోగాలను మోపారు.
Comments
Please login to add a commentAdd a comment