అతనికి సహకరించిన బాలికల తల్లికి కూడా...
బాధిత బాలికలు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.
విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్‌కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
విచారణలో పుట్ట సతీష్ పవన్‌కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్‌కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment