పీసీపల్లి : రోడ్డు మార్జిన్‌లో తోపుడు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ దళిత యువకునిపై అధికార పార్టీ నేత ఆదివారం సాయంత్రం దౌర్జన్యానికి దిగి ఆ బండికి అడ్డంగా మరో బంకు పెట్టి నానా హడావుడి సృష్టించాడు. ఈ సంఘటన పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్‌లో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు నీలం అమర్‌నాథ్ జిల్లా పాలకేంద్రం డైరెక్టర్, మండల టీడీపీ నాయకుడు పులి వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 8 సంవత్సరాలుగా నీలం అమర్‌నాథ్ రోడ్డు మార్జిన్‌లో సాయంత్రం సమయంలో ఓ బండిపై టిఫిన్ సెంటరును నిర్వహించుకుంటున్నాడు. అయితే ఆ తోపుడు బండి ఉన్న స్థలం తమదంటూ టీడీపీ నాయకుడు జేసీబీపై బంకును తీసుకువెళ్లి అమర్‌నాథ్ తోపుడు బండికి అడ్డుగా పెట్టించాడు. ఇదేంటి అని అడిగిన అమర్‌నా«థ్‌ను కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి దిగాడు. తనకు తోపుడు బండే జీవనాధారమని ఇబ్బందులు పాలు చేస్తే ఆత్మహత్యే శరణ్యం అని వాపోయాడు. అమర్‌నా«థ్‌ను దూషించడమేకాక అతనిపై దౌర్జన్యానికి దిగడంతో దళితుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అధికార పార్టీ నాయకుని ఆగడాలు అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్ ఇన్‌చార్జి మురళిని ‘సాక్షి’ వివరణ కోరగా సోమవారం ఈ సంఘటనపై హనుమంతునిపాడు ఎస్సై విచారణ జరుపుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment