పోలీసులపై దౌర్జన్యం..ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్‌ | Congress MLCs Son Arrested For Assaulting Cop In Drunken State | Sakshi
Sakshi News home page

పోలీసులపై దౌర్జన్యం..ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్‌

Published Mon, Dec 7 2020 4:58 PM | Last Updated on Mon, Dec 7 2020 4:58 PM

Congress MLCs Son Arrested For Assaulting Cop In Drunken State - Sakshi

బెంగుళూరు : కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్‌ అహ్మద్‌ ​కుమారుడు ఫయాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి వేళ బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఫయాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఫయాజ్‌, అతని స్నేహితులతో కలిసి హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన కారణంగా ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (ఏలూరుకు రానున్న కేంద్ర బృందం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement