
సాక్షి, చిత్తూరు: తిరుపతికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లనటం దుర్మార్గం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. తనకు తిరుపతిలో సొంతిల్లు ఉంది అని, చంద్రబాబుకే అక్కడ సొంతిల్లు లేదన్నారు. బాబు జూమ్‌లో, లోకేష్ ట్విట్టర్‌లో మాత్రమే కనబడతారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.
చదవండి: దళిత ఓటర్లను అడ్డుకున్న టీడీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment