
సాక్షి, విజయవాడ : 20 నెలల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి విజయవాడలో బుధవారం మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు ఉన్న సంబంధం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాటిపై తాము స్పందించనవసరం లేదని, పాదయాత్రలు, తలకిందులు యాత్రలు చేసినా తమకు నష్టం ఏం లేదని స్పష్టం చేశారు.
బీజేపీ ఎవరిని తెచ్చుకున్నాసీఎం జగన్‌కు ప్రజా బలం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై బీజేపీ ఏం చెబుతుందని, విభజన చట్టంలోని అంశాలు, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నెరవేర్చామా లేదా అనేది వారికి వారు ఆలోచించుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కాబట్టే తిరుగులేని విజయాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. మోసాలు, మాయలను ఎవరూ నమ్మరని, 13 జిల్లాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయని, న్యాయ స్థానానికి అన్ని అంశాలను వివరిస్తామని అన్నారు. ఏ క్షణమైనా పరిపాలన రాజధానికి వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
చదవండి:
నిత్య పెళ్లికొడుకు అరాచకం.. ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని
అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి!
Comments
Please login to add a commentAdd a comment