
సాక్షి, తిరుపతి : ఈ నెల 29న తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. తనకు పార్టీ నాయకులు, కార్యకర్తల సపోర్ట్ బాగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఇంత మంచి అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదని, సీఎం ప్రోత్సాహంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఓట్లడుగుతానని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. మెజారిటీ ఎంతనేది ఓటరు దేవుళ్లే నిర్ణయిస్తారురని పేర్కొన్నారు.
చదవండి: సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి!