
ఈవీఎంలో సైకిల్ గుర్తుకు ఇరువైపులా ఇంకు గుర్తులు వేసిన దృశ్యం
ముత్తుకూరు: తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికల సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో శనివారం జరిగిన పోలింగ్‌లో చదువురాని ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. టీడీపీ కార్యకర్తలు కొందరు ఓటు వేసేందుకు వెళ్లి ఈవీఎంలో సైకిల్ గుర్తుకు ఇరువైపులా చిక్కగా ఇంకు మార్కు వేశారు.
అందరూ సైకిల్‌కే ఓటు వేస్తున్నారనే భ్రమలు కల్పించేందుకు, చదువురాని ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఈ ఎత్తుగడను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెంటనే పసిగట్టారు. ఈ విషయాన్ని పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు కూడా అప్రమత్తమై సైకిల్ గుర్తుకు ఇరువైపులా ఉన్న సిరా గుర్తులను పూర్తిగా తుడిచి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment