సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: వరుసగా ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై కూడా తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న పరిస్థి తుల్లో ఈ ఎన్నికను ఎదుర్కోవడం కష్టమని పార్టీ శ్రేణులు, నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలు స్తోంది. అందుకే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనా నేతలెవరూ ఆ ఊసే ఎత్తడంలేదు. మునిసిపల్ ఎన్నికలు, అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థయి ర్యం దెబ్బతింది. చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనే టీడీపీ కుదేలైపోవడంతో ఆ పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. ఈ తరుణంలో తిరుప తి ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ఏం చేయాలో టీడీపీ నేతలకు పాలుపోవడంలేదు. స్థానిక ఎన్ని కల ముందే తిరుపతికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించి హడావుడి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు దానిపై మాట్లాడడంలేదు. రాజధానిలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆయనకు నోటీసు ఇవ్వడంతో ఎలా తప్పించుకోవాలనే దానిపైనే ఆయన దృష్టి పెట్టి నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి, అవి నీతి కేసులు చుట్టుముట్టడంతో చంద్రబాబు కూడా నిర్వేదానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది.
పనబాక లక్ష్మి మౌనం
ఉప ఎన్నికలో పోటీకి దిగనున్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎన్నికల షెడ్యూల్ వచ్చినా తనకు పట్టనట్టే ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పోటీ చేసేందుకు ఆమె సిద్ధపడలేదని, చంద్రబాబు, టీడీపీ నేతలు ఆమెను పోటీకి ఒప్పించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థిత్వం ప్రకటించిన చాలారోజుల తర్వాత ఆమె తిరుపతిలో మొక్కుబడిగా పర్యటించి వెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీ గ్రాఫ్ మరీ డౌన్ అయిపోవడంతో పోటీ చేసే విషయంపై ఆమె తర్జనభర్జన పడుతున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇతర పార్టీలకు అగమ్యగోచరం
ఉప ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించి ముందే చేతులెత్తేశారు. అయితే ఈ ప్రకటన వెనుక ఆంత ర్యం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తు న్నారు. ఉప ఎన్నికలో టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకే పవన్ పోటీ నుంచి తప్పుకున్నారని వారు చెబుతు న్నారు. అందులో భాగంగానే బీజేపీతో విడిపోవ టానికి కూడా సిద్ధపడినట్లు వారు విశ్లేషిస్తున్నారు. ఇక తిరుపతి బరిలో దిగడానికి బీజేపీ నేతలు కూడా తటపటాయిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ నేతల్లో కూడా ఆందోళన నెలకొంది. మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమం, గ్యాస్, పెట్రోధరల పెంపుపై జనం మండిపడు తున్న తరుణంలో ఉప ఎన్నిక రావడం బీజేపీకి ప్రాణసంకటంగా మారిందని విశ్లేషకులు చెబుతు న్నారు. తిరుపతి అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులను బీజేపీ ఖరారు చేసిందని, పోటీ చేసేందుకు ఆయన సాహసించడం లేదని ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో తిరుపతి టెన్షన్
Published Thu, Mar 18 2021 5:03 AM | Last Updated on Thu, Mar 18 2021 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment