ముత్తుకూరులో మాట్లాడుతున్న నారా లోకేశ్
సాక్షి, ముత్తుకూరు: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మరోసారి రుచిచూపారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రోడ్‌షో నిర్వహించిన లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోతే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ‘పరామర్శించారా’ అనాల్సింది.. ‘పరవశించారా’ అంటూ నవ్వులు పూయించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని పునరుద్ఘాటించారు.
రామాయపట్నంతోపాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదంటూ తన పరిజ్ఞానాన్ని చాటారు. అదే సమయంలో ‘ఏం పీకారు.. ఎంత దొబ్బారు’’ అంటూ సీఎంపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ‘సైకోరెడ్డి’గా మారుస్తున్నానన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిల్లులతో పోల్చారు. వారు మ్యావ్..మ్యావ్ అంటున్నారని గేలి చేశారు. తాము అధికారంలోకి వస్తే తన తండ్రి చంద్రబాబుకున్న పెద్ద మనసు తనకు లేదని, అధికారులను, పోలీసులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. సభలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఈ సభలో పాల్గొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment