
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి లక్షల కోట్లు నిధులు అందిస్తున్నా.. బీజేపీపై ప్రజలు విశ్వాసం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో రూ.8.17 లక్షల కోట్లు ఇన్‌ఫ్రా తదితర రంగాల్లో పెట్టుబడులుగా రానున్నాయని చెప్పారు.
ఇండస్ట్రియల్, పెట్రో కారిడార్లు ఏర్పాటైతే రాష్ట్రంలో 1.43 లక్షలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైల్వేజోన్ అంశంపై రైల్వే మంత్రిత్వ శాఖతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. రాష్ట్రాన్ని బీజేపీ ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఇక్కడి నుంచి మాత్రం ప్రతిఫలం దక్కలేదన్నారు. జమిలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదన్నారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టు కూడా పరిశీలనలో ఉందని జీవీఎల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment