
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని.. ఏ ఒక్కరూ ముంపు ముప్పు బారిన పడకుండా చూడాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల జలవనరుల శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
► వర్షాలకు నదులు, కాలువల కరకట్టలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. పునరావాసం కల్పించాలని సూచించారు.
► అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెరువులు అన్నింటినీ వరద నీటితో నింపాలని ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment