
సాక్షి, అమరావతి: స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్గా కర్రా గిరిజా హర్షవర్ధన్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 137 మంది చైర్మన్లను ఎంపిక చేయటం గొప్ప విశేషం అని కొనియాడారు. పార్టీకోసం కష్టపడినవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు.
మరో 30ఏళ్ళు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన తెలిపారు. ఇక గిరిజా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్గా పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని గిరిజా హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రా రెడ్డి, ఆర్థర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీ ఎస్ ఐడీసీ ఎండీ పూర్ణ చంద్రరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హర్ష వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.