తుంగభద్ర పుష్కరాలపై సమీక్షిస్తున్న మంత్రులు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే..
u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్‌లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి.
u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి.
u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment