
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదుల వరదను సమర్థంగా నియంత్రించారని, వరద ముప్పు నుంచి తప్పించారని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అభినందించారు. అల్పపీడన ప్రభావం వల్ల ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద వస్తోందని.. ఆ వరదను నియంత్రించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరకట్టలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.