
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి జీర్ణించుకోలేక పేపర్ లీక్ అంటూ దరిద్రమైన ప్రచారం మొదలుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
ఆయన శుక్రవారం నెల్లూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలను తమ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ తరాలకోసం చేస్తున్న మహాయజ్ఞాన్ని అధికారులు బాగా నిర్వహించినందుకు అభినందించాల్సిందిపోయి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో చులకన భావం కలిగించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబుకు వయస్సు పెరిగినా వంకర బుద్ధి మాత్రం పోలేదని, ప్రభుత్వంపై నిందలు మోపి రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment