
చిన్నదిమిలి కాలనీవాసుల సమస్యలు వింటున్న మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కళావతి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు.
క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్‌కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు.