సాక్షి, శ్రీకాకుళం: పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణకు రాజకీయ చతురత, అనుభవం ఏముందని సూటిగా ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. పవన్‌కు స్థిరత్వం లేదని, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేయించాడని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ పరిణితి చెందిన రాజకీయవేత్త కాదని, పవన్ నామమాత్రమైన ఓట్లు మాత్రమే ప్రభావితం చేయగల నాయకుడని మండపడ్డారు. అసందర్భ ప్రేలాపన, అవసరంలేని వాగుడు పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. పవన్ వ్యవహార శైలిని ప్రజలు హర్షించడం లేదని, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులే పవన్ కల్యాణ్‌ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందిన ఎద్దేవా చేశారు. తనకున్న అభిమానులతో కలిసి పార్టీ పెట్టి కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ అవసరానుకూలంగా మారిపోయే సైడ్ యాక్టర్ ఎద్దేవా చేశారు. ఒకసారి టీడీపీతో, మరోసారి బీజేపీతో కలిసి పవన్ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment