Cabinet Subcommittee
-
రైతుకు ‘భరోసా’ కరువు!
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజుల్లో ముగియనున్నా రైతుభరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో అసలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుండటంతో అయోమయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. పునఃసమీక్ష ప్రకటనతో సరి! కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా (గతంలో రైతుబంధు) మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అసలు రైతుల కన్నా ధనికులు, అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారనేది కొత్త సర్కారు ఉద్దేశం. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతల్లో దాదాపు రూ. 25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పున:సమీక్ష అనంతరం ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ఐదెకరాలా? పదెకరాలా? ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్నవారిలో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది ఉండగా వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. ⇒ జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. ⇒ అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది.⇒ జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభి ప్రాయాలు తీసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు.⇒ జూలై 23వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. -
అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వార్షికాదాయం ఆధారంగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షికాదాయం రూ. లక్షన్నర లేదా మాగాణి (తరి) 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చినట్లు కొత్త రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయ పరిమితి రూ. 2 లక్షలుగా ప్రతిపాదించినట్లు తెలిపింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.ఎస్. చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. సక్సేనా కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకుంటాం: ఉత్తమ్ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విషయంలో సలహాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధివి«ధానాల రూపకల్పనలో వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిషనర్‌గా, సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీలో అధికారుల బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీలో అవలంబిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఒకేచోట కార్డు ఉండేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉపసంఘం చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. -
ఉద్యోగుల సమస్యలపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
-
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు. మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. ఆలస్యమైనా.. అనుకూలంగానే ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్ఆర్), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్‌రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్‌ను పోరాడి సాధించుకున్నాం. ఆ డిమాండ్ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్ఆర్ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్నీ పాజిటివ్ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్‌గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్లో తీర్మానం చేస్తామన్నారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభవార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది.. సీఎంకు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్ రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రత్నాకర్‌బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లను చెల్లించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అలాగే జీపీఎఫ్‌కు సంబంధించిన కొన్ని బిల్లులను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల 31 నాటికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ బకాయిలు రూ.3వేల కోట్లను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హామీల అమల్లో భాగంగా మొదటగా ఏఈపీజీఎల్ఐ క్లెయిమ్స్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి కూడా కొన్ని బిల్లులు క్లియర్ చేసినట్లు చెప్పారని, మిగతా బిల్లులు కూడా షెడ్యూల్ ప్రకారం మార్చి 31లోపు చెల్లిస్తామని తెలిపినట్లు అరవ పాల్ వివరించారు. -
ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదురి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సజ్జల, ఆదిమూలపు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు. కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు చెప్పారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. బిల్లులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను మార్చి 31లోపు క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామన్నారు. రిటైర్మెంట్కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, ఏపీజీఎల్ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. మార్చి 31లోగా పెండింగ్ బిల్లుల చెల్లింపు ఉద్యోగులకు ఈ నెల 31లోగా రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మహిళా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తంచేశారు. 2004కు ముందు ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్లకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారడానికి అనుమతించడానికి సానుకూలంగా స్పందించారు. వీఆర్ఏలకు డీఏ పునరుద్ధరణ, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు ఇవ్వడానికీ ఒప్పుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు, రెండో దశలో నియామకమైన వారికి త్వరగా ప్రొబేషన్ డిక్లరేషన్‌కు అంగీకరించారు. మేం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాం. వీఆర్వోలకు ప్రమోషన్ కోటా 75 శాతం చేయడం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 కింద వేతనాల చెల్లింపుకు డిమాండ్ చేశాం. గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రొబేషన్ డిక్లరేషన్, సమగ్ర శిక్ష ఉద్యోగాలకు వేతనాల పెంపు, గత ప్రభుత్వం కక్ష సాధింపుగా ఉద్యోగుల మీద పెట్టిన ఏసీబీ కేసుల్లో బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరాం. – ఎ. వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు పెండింగ్ బిల్లుల చెల్లిస్తామన్నారు ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసకుంటామని చెప్పారు. రూ.16వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి బయోమెట్రిక్ తొలగించాలని కోరాం. ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించి సీఎస్ దగ్గర సమావేశం ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పెండింగ్ డీఏలపై చర్చిస్తామన్నారు పెండింగ్ డీఏల విషయంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దుపైనా చాలాసేపు చర్చించాం. త్వరలో మా సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసుకుని ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి, చైర్మన్ -
దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న భూ హక్కు–భూ రక్ష పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైంది. ఉప సంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి పథకం ప్రగతిని సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీల్లోనూ సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీపీఎస్‌తోనే భద్రత
సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) చాలా మెరుగైందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. దానిపై చర్చించాలని మరోసారి ఉద్యోగ సంఘాలను కోరింది. సీపీఎస్ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) ప్రభుత్వం తట్టుకునే పరిస్థి తి లేదని, సీపీఎస్ వల్ల ఎలాంటి భద్రత లేదని చెప్పారు. అందుకే మధ్యేమార్గంగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిగురించి లోతుగా చర్చించి ఇంకా మెరుగుపరిచేందుకు సల హాలివ్వాలని నేతలను కోరారు. జీపీఎస్ తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవుదామని మంత్రులు, ప్రభుత్వ సలహాదారు చెప్పారు. పీఆర్సీకి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్య లు తీసుకుంటామని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ ణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు. -
భూసర్వే వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంలో భాగంగా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో ఎక్కువ డ్రోన్లను వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆదేశించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్ష నిర్వహించింది. అటవీ భూముల సరిహద్దులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించడంతో పాటు పట్టణ ప్రాంతాల సర్వేలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,277 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల కోసం చిత్రాలు తీసే ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు సబ్‌కమిటీకి వివరించారు. 6,843.81 చదరపు కిలోమీటర్ల మేర 51 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే మొబైల్ మేజిస్ట్రేట్లకు శిక్షణ పూర్తయిందని, అర్బన్ ఏరియాల్లో అధికారులకు పది రోజుల శిక్షణ ప్రారంభించామన్నారు. త్వరలోనే వార్డు, ప్లానింగ్ సెక్రటరీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఓటీఎస్‌పై చైతన్యం కలిగించాలి ప్రజల్లో ఓటీఎస్‌పై చైతన్యం కలిగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రులు సూచించారు. ఇప్పటి వరకు పది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, 4.97 లక్షల మందికి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్ చేసినట్టు అధికారులు వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 2.83 లక్షల మంది డాక్యుమెంట్లకు అనుమతులు లభించాయన్నారు. సమీక్షలో సీసీఎల్ఏ కమిషనర్ జి.సాయిప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సుబాబుల్ రైతుకు ప్రభుత్వం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనీల్‌కుమార్ స్పష్టం చేశారు. సుబాబుల్ రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యూకలిప్టస్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుబాబుల్ ఎక్కువగా సాగవుతుంది. గతంలో నేరుగా పేపర్ మిల్లులే కొనుగోలు చేసేవి. 2017లో 45 మంది బయటి వారికి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు. ఈ ట్రేడర్స్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలతో కుమ్మక్కవుతున్న ట్రేడర్స్‌ను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పంటల మాదిరిగా ఈ పంటలనూ ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పంటను పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పర్మిట్లు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడండి: మంత్రి పెద్దిరెడ్డి రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తక్షణమే మొదలు పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు. -
పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్య నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాత భవనాల కూల్చివేత, పడావుపడిన బావుల పూడ్చివేత, పనుల బిల్లుల చెల్లింపు విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని ఈ దిశగా గ్రామ పంచాయతీలకు అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొంది. శనివారం గ్రామీణ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన మొదటిసారి సమావేశమైంది. సమావేశంలో మ్రంతులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
20 సంస్థలకు 120 ఎకరాలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 120 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో యనమల అధ్యక్షతన బుధవారం ఉపసంఘం సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించగా కొన్ని తిరిస్కరించినట్లు మంత్రులు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు 5.56 ఎకరాలు కేటాయించినట్లు మంత్రులు తెలిపారు. ఈ భూములకు ఎకరాకు రూ.10 లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు ధర నిర్ణయించినట్లు చెప్పారు. నాబార్డుకు ఇచ్చే భూమి విలువను ఎకరాకు రూ.2 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. రామకృష్ణ మిషన్, ఉన్నత విద్యా శాఖ, ఏపీ ఫైబర్‌నెట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘం, అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ, కెనారా బ్యాంకు, విజయా బ్యాంకు, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, ఏపీ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్, అమరావతి ఎడ్యుకేషనల్ కల్చరర్ అకాడమీ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయింపు ధరలు నిర్ణయించినట్లు వారు తెలిపారు. గతంలో పది విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలను కేటాయించినట్లు వివరించారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
‘స్థానికం’లో బీసీ కోటా తగ్గదు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో 34 శాతానికి తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని నిర్ణయించింది. బీసీ జనాభా గణన, నెలాఖరులో పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ‘స్థానిక’రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో పలు అంశాలపై ఉపసంఘం చర్చించింది. హైకోర్టు తీర్పు, బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. జూపల్లి మాట్లాడుతూ.. ‘సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రిజర్వేషన్లపై, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపసంఘానికి వివరించారు. కొందరు కోర్టుకెళ్లడంతో చిక్కులు: మంత్రులు సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ‘2013 ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎన్నికలపై కొందరు కోర్టుల్లో కేసులు వేయడంతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జూలై 31తో పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారులకు అప్పగించాలా? పాలక వర్గాలకు అప్పగించాలా? కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీసీ జనాభా గణనపై హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదీ ఆ భేటీలోనే నిర్ణయిస్తాం. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది’అని తెలిపారు. \ -
మళ్లీ చర్చలు..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చలు మరో రెండ్రోజులు వాయిదా పడ్డాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైనా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే రెండ్రోజులు ఆలస్యమైనా మరింత కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఈ నెల 16న తాను స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి ఈ నివేదికను అందజేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మరింత పక్కాగా నివేదికను అందించాలని, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరపాలని సీఎం మంత్రులను ఆదేశించారు. ఈటల సారథ్యంలోని సబ్ కమిటీలో ప్రస్తుతం కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని కూడా చేర్చుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ నాయకులతో ఈ నెల 16న మధ్యాహ్నం సమావేశమై, అదేరోజు ప్రభుత్వం తరఫున నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో కంటే వేగంగా పీఆర్సీ ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటోందని, గతంలో ఉన్న ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఈ పని పూర్తి చేసేందుకు అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీపై సీఎం కీలక ప్రకటన చేయటం ఖాయమని తెలుస్తోంది. స్పష్టమైన సిఫారసులు లేకుండానే.. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం మొత్తం 52 అంశాలపై తమ నివేదికను సీఎంకు సమర్పించింది. ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన 34 డిమాండ్లను ఇందులో ప్రస్తావించింది. తక్షణమే పరిష్కరించే సమస్యలు, వివిధ అడ్డంకులున్న సమస్యలు, ఇప్పటికిప్పుడు పరిష్కరించలేని సమస్యలుగా.. వీటిని వర్గీకరించినట్లు సమాచారం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు పీఆర్సీ ఏర్పాటు, ఈలోగా మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లింపు, గతేడాది జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, కొత్త జిల్లాలప్పుడు ఇచ్చిన ఆర్డర్ టు సర్వ్ రద్దు చేసి శాశ్వత కేటాయింపులు, ఉద్యోగుల బదిలీలు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రప్పించే అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను యథాతథంగా నివేదికలో పొందుపరిచిన సబ్ కమిటీ.. స్పష్టమైన సిఫారసు చేయకుండానే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసింది. రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను నివేదికలో మాటమాత్రమే ప్రస్తావించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోందని సూచించింది. నేడు, రేపు భేటీలు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం కొన్ని అంశాలపై మంత్రులను ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానాలివ్వకపోవటంతో మరోమారు సమావేశమై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 12, 13వ తేదీల్లో అధికారులతో సమావేశాలు జరపాలని సబ్ కమిటీ నిర్ణయించింది. -
రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక స్వయం ప్రతి పత్తిగల రోడ్డు భద్రత సంస్థ ఏర్పాటు అవ సరమని ఆ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. కాలు ష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉన్న ట్టుగానే రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొంది. దీనికి విధివిధానాలతో కూడిన ప్రతిపాదన సిద్ధం చేసి సీఎం పరిశీలనకు పంపనున్నట్టు వెల్లడించింది. సోమవారం ఉపసంఘం సభ్యులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు మాదాపూర్‌లోని ‘న్యాక్’ భవనంలో సమావేశమై సమీక్షిం చారు. గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా పరిస్థితి ఇప్పటికీ ఆందోళనక రంగానే ఉందని, పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఆధునిక వాహనాలు అందుబాటు లోకి రావటం, రోడ్ల వెడల్పు తదితర కార ణాల వల్ల వాహనాల వేగం పెరిగి ప్రమాదాలను పెంచుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు. దీంతో ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లు, నిరంతర నిఘా, ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ అవసరముందని కమిటీ అభి ప్రాయపడింది. పాఠ్యాంశాల్లో చేర్చేలా... కేరళ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తక్కువగా నమోదవుతున్న దృష్ట్యా అక్కడి పరిస్థితులపై ఇటీవల అధికారుల బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఆ నివేదికనూ మంత్రుల కమిటీ పరిశీలించింది. చిన్న రాష్ట్రమైన కేరళను చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదని, రోడ్డు భద్రత పటిష్టంగా ఉన్న స్వీడన్ లాంటి దేశాలతో పోటీపడేలా మనం పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పడే సంస్థకు స్వయం ప్రతి పత్తితోపాటు ప్రత్యేక నిధి కూడా ఉండాల్సి ఉంటుందని, దీనికి చట్టబద్ధత కల్పించేందుకు వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ప్రతిపాదనను సీఎంకు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు విధించే జరిమానా మొత్తాన్ని కూడా ఈ సంస్థకే కేటాయించాలని కూడా అభి ప్రాయపడ్డారు. ఇక ప్రజా రవాణాకు ప్రజలు ప్రాధాన్యమిచ్చేలా ఆ వ్యవస్థను తీర్చి దిద్దాల్సిన అవసరముందని, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరిగేలా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బోధన అవసరమని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించే తరహాలో వాహనాల తయారీ, నిబంధనలు బేఖాతరు చేసేవారికి భారీ జరి మానాల విధింపు, పర్యావరణ అనుకూల విధానాలను ప్రవేశపెట్టడం,ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకోవటం, లైసెన్స్ జారీలో అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానాల అమలు తదితర అంశాలపై కూడా చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, రైల్వే పోలీసు డీజీ కృష్ణ ప్రసాద్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆర్ఓ కృష్ణప్రసాద్, ఆర్అండ్బీ ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు, రవాణాశాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం
-
తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సభ్యులుగా ఉంటారు. సాహిత్య అకాడమీతోపాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతోపాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు (ఫుడ్ కోర్టులు), పుస్తక ప్రదర్శన, విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శన, పురావస్తు శాఖ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేడియం లోపల, బయట అలంకరణ ఉండాలని, తెలంగాణ సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలో ప్రతీరోజు సాయంత్రం సాహితీ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు రవీంద్రభారతి, అందులోని మినీ హాలు, ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియం, ఎల్బీ ఇండోర్ స్టేడియంలో సాహిత్య సభలు నిర్వహించాలని చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని పేర్కొన్నారు. అందుకు వీలుగా పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంçస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింబించేలా లఘుచిత్రానికి(డాక్యుమెంటరీ) రూపొందించాలని సూచించారు. సమీక్షకు ముందే సీఎం ఎల్బీ స్టేడియం సందర్శించారు. ప్రధాన వేదికతోపాటు మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అధికారులకు సూచించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, బుర్రా వెంకటేశం, స్పోర్ట్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి నర్సింహరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు
- మత్స్యకారుల సొసైటీలకు మంత్రి తలసాని హెచ్చరిక - మత్స్య సంక్షేమంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టించే సొసైటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పశుసం వర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తలసాని అధ్యక్షత న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మత్స్య సహకార సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఉపసంఘంలో సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఫెడరేషన్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు. మత్స్యకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నూతనంగా గంగ పుత్ర, ముదిరాజ్ కులస్తులకు మాత్రమే సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. కొన్నిచోట్ల సొసైటీల్లో నూతన సభ్యత్వాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని జిల్లాల్లో గంగపుత్రులు లేరని, ముదిరాజ్ కులస్తులే చేపల వృత్తిని కొనసాగిస్తున్నారని, అందు వల్ల చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయన్నా రు. చేపలు పట్టే వారందరూ గంగపుత్రులేన న్న ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామన్నారు. 75 శాతం సబ్సిడీపై వాహనాలు... ఈఏడాది మత్స్యశాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తలసాని చెప్పారు. మత్స్యకారులను దళారుల దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయడంతోనే చేతులు దులుపుకోదని, వాటి ని విక్రయించుకునేందుకు 75శాతం సబ్సిడీ పై వాహనాలను అందిస్తుందన్నారు. ఆధుని క వసతులతో కూడిన మార్కెట్లను నిర్మిం చేందుకు చర్యలను చేపట్టిందన్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో రూ.50లక్షలతో చేపల మార్కెట్లను నిర్మిస్తామన్నారు. మత్స్యకారులు దళారులకు చేపలను విక్రయించి నష్ట పోవద్దని సూచించారు. ఐకమత్యంతో అభి వృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించాలన్నారు. సొసైటీలను బలోపేతం చేసుకోవ డం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్ లో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను చరిత్రలో సువ ర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. -
మంత్రివర్గ ఉప సంఘం భేటీ
అమరావతి: ఇసుక మాఫియా కట్టడి, ఇసుక విధానంపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సమావేశమయింది. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి చినరాజప్ప, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో పాటు కృష్ణా, గుంటూరు కలెక్టర్లు, రెవెన్యూ, హోం, విజిలెన్స్, మైనింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాలపై ఇప్పటివరకు నాలుగు వేల ఫిర్యాదులు వచ్చాయని, మొత్తం 189 కేసులు నమోదైనట్లు, 257 మందిని అరెస్టు చేసినట్లు, 465 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 337 చోట్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, 212 చోట్ల సాధారణ ప్రజలను ఇసుక తవ్వకుండా బెదిరిస్తున్నారని ప్రభుత్వానికి సమాచారముందని, వీటిపై దృష్టి సారించనున్నట్లు మంత్రులు, అధికారులు పేర్కొన్నారు. -
అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరపాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలని, దశలవారీగా తెలం గాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలను ఒక అవకాశంగా మార్చుకుంటామని, నగదు రహిత విధా నంతో పాలనా వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్ చెల్లింపులకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమా వేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, బ్యాంకుల ప్రతినిధులు, టీ–వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశానికి హాజరయ్యారు. నగదు రహిత చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే తమ ప్రాథమిక లక్ష్యమని కేటీఆర్ అన్నారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామ న్నారు. ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం పెంచేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమా లను ఈ నెల 7 నుంచి ప్రారంభించామ న్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను టీ–వ్యాలెట్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలు, ప్రైవేట్ సంస్థలు చేసే లావాదేవీలపై చార్జీల్లేకుండా పూర్తిగా ఉచితం చేయాలని కేంద్రాన్ని కోరతామ న్నారు. వివిధ సంస్థలు, బ్యాంకులు టీ– వ్యాలెట్‌తో కలసి పనిచేసేలా ప్రయత్ని స్తామన్నారు. టీ–వ్యాలెట్‌తో ఇతర వ్యాలె ట్లకు సైతం చెల్లింపుల సౌకర్యానికి అను మతించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నేరుగా ప్రధానితో మాట్లాడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. టీ–వ్యాలెట్ మీద ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీ–వ్యాలెట్ అంతర్జాతీయ ప్రమా ణాలతో ఉంటుందని, భద్రత, సదుపాయం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందని జయేశ్‌రంజన్ చెప్పారు. డిజిటల్ చెల్లిం పులపై ఏర్పాటైన సురేశ్‌చందా టాస్క్‌పోర్స్ కమిటీ అధ్యయన నివేదిక, సిఫారసులను కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. -
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే 8 శాతం రాయితీ
వాణిజ్య పన్నుల సబ్ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ముందస్తు పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు అవి చెల్లించే పన్నులో 8 శాతం రాయితీ ఇవ్వాలని వాణిజ్యపన్నులపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (సబ్ కమిటీ) నిర్ణయించింది. 2016 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రూ. 252 కోట్ల మేర వార్షికాదాయం సమకూరుతుందని అంచనా వేసింది. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాకో డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల పన్నుల వసూళ్లు మరింత వేగవంతమవుతాయని, జీరో దందా తగ్గుతుందని మంత్రులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అవసరమైతే ఇద్దరు ఐఏఎస్ అధికారులను డీసీ హోదాలో నియమించాలని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ- ఆంధ్ర సరిహద్ధుల్లో ఉన్న ఏడు కొత్త చెక్‌పోస్టులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న మరో ఏడు చెక్‌పోస్టులను ఏకకాలంలో ఆధునీకరించేందుకు టెండర్లు పిలవాలని, భూసేకరణతో పాటు నిర్మాణం పూర్తి చేసి వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ఆయా సంస్థలకే బీవోటీ పద్ధతిలో ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. అదనపు సిబ్బందిని నియమించాలన్న అధికారుల కోరిక మేరకు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ ద్వారా నియమించుకోవడం, అవసరమైతే సర్వీస్ కమిషన్ నుంచి నియామకాలు చేపట్టేందుకు ఉపసంఘం అనుమతిచ్చింది. మొజాంజాహి మార్కెట్లోని మార్కెటింగ్ శాఖకు చెందిన భవనం, బంజారాహిల్స్‌లోని నీటిపారుదల శాఖ భవనాలను వాణిజ్యపన్నుల శాఖకు అద్దెకిస్తామని మంత్రి హరీశ్‌రావు కమిటీ సభ్యులకు సూచించారు. సనత్‌నగర్‌లో కాలుష్య నియంత్రణమండలి స్థలం కూడా అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. -
ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం
చెరువుల పునరుద్ధరణపై మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లోనూ తొలిదశలో కార్యక్రమం సీఎంకు నివేదించిన అనంతరం మార్గదర్శకాలు డిసెంబర్ నుంచి పనుల ప్రారంభం హైదరాబాద్: గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరందించగల చెరువులకే పునరుద్ధరణలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణకు స్వచ్ఛందంగా ముందుకువచ్చే గ్రామాల్లోనూ తొలిదశలోనే పనులు ప్రారంభించాలని ప్రతిపాదిస్తోంది. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను రూపొందించాల ని నిర్ణయించింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై గురువారం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 46 వేల చెరువుల్లో ఏటా తొమ్మిది వేల వరకూ చెరువులను అభివృద్ధిలోకి తేవాలనే కార్యాచరణ ప్రణాళికపై నాలుగున్నర గంటల పాటు చర్చించారు. తొలిదశలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 751 కోట్లతో 1,500 చెరువులను అభివృద్ధి పరిచి... మూడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ పథకం కింద రూ. 710 కోట్లతో 1,500 చెరువుల మరమ్మతులు చేపట్టి 3.20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని, ఏఐబీపీ కింద రూ.281 కోట్లతో 44,574 ఎకరాలు కొత్త ఆయకట్టును అభివృద్ధి చేయాలని, జైకా కింద సైతం రూ. 269 కోట్ల వ్యయంతో 27 వేల ఎకరాల కొత్త ఆయకట్టును తీసుకురావాలని నిర్ణయించా రు. ఉపాధిహామీ కింద రూ.4,500 కోట్లతో తొమ్మిది వేల చెరువుల్లో పూడికతీత చేపట్టి.. 1.85 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రతిపాదించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణను ఉద్యమంలా చేపడతామన్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని... ఆయకట్టు, పరివాహకం ఎక్కువగా ఉన్న చెరువులకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, మూడు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు. ‘ఫీజు’, ఇసుకపైనా చర్చ.. ఇదే సబ్ కమిటీ సమావేశంలో ఇసుక విధానం, ఆహార భద్రతా కార్డులు, రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అం శాలపైనా చర్చించారు. రాక్ శాండ్‌ని ప్రోత్సహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. నామినేషన్‌పై ఇచ్చే పనుల పరిమితిని రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెంచే విషయంపైనా చర్చ జరిగింది. కళాశాలలకు బకాయిపడ్డ సుమారు రూ. 1,400 కోట్లను చెల్లించే అంశంపైనా చర్చిం చారు. శుక్రవారం దీనిపై సీఎంతో మాట్లాడాక ఒక నిర్ణయానికి రావాలని సంకల్పిం చారు. రుణమాఫీపై శుక్రవారం బ్యాంకర్లతో మరోమారు సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
నవంబర్ నుంచి అన్న క్యాంటీన్లు
మంత్రివర్గ ఉపసంఘం ప్రకటన చెన్నైలో అమ్మ క్యాంటీన్ల పరిశీలన చెన్నై : ఈ ఏడాది నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో నాలుగు జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిపై అవగాహనకు చెన్నైలోని రెండు అమ్మ క్యాంటీన్లను మంత్రులు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురం, తిరుపతిలలో ఐదేసి చొప్పున అన్న క్యాంటీన్లను తొలివిడతగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం