సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు
- మత్స్యకారుల సొసైటీలకు మంత్రి తలసాని హెచ్చరిక
- మత్స్య సంక్షేమంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టించే సొసైటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పశుసం వర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తలసాని అధ్యక్షత న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మత్స్య సహకార సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఉపసంఘంలో సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఫెడరేషన్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు. మత్స్యకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నూతనంగా గంగ పుత్ర, ముదిరాజ్ కులస్తులకు మాత్రమే సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. కొన్నిచోట్ల సొసైటీల్లో నూతన సభ్యత్వాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని జిల్లాల్లో గంగపుత్రులు లేరని, ముదిరాజ్ కులస్తులే చేపల వృత్తిని కొనసాగిస్తున్నారని, అందు వల్ల చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయన్నా రు. చేపలు పట్టే వారందరూ గంగపుత్రులేన న్న ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామన్నారు.
75 శాతం సబ్సిడీపై వాహనాలు...
ఈఏడాది మత్స్యశాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తలసాని చెప్పారు. మత్స్యకారులను దళారుల దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయడంతోనే చేతులు దులుపుకోదని, వాటి ని విక్రయించుకునేందుకు 75శాతం సబ్సిడీ పై వాహనాలను అందిస్తుందన్నారు. ఆధుని క వసతులతో కూడిన మార్కెట్లను నిర్మిం చేందుకు చర్యలను చేపట్టిందన్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో రూ.50లక్షలతో చేపల మార్కెట్లను నిర్మిస్తామన్నారు.
మత్స్యకారులు దళారులకు చేపలను విక్రయించి నష్ట పోవద్దని సూచించారు. ఐకమత్యంతో అభి వృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించాలన్నారు. సొసైటీలను బలోపేతం చేసుకోవ డం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్ లో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను చరిత్రలో సువ ర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు.