Fishermen Society
-
సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు
- మత్స్యకారుల సొసైటీలకు మంత్రి తలసాని హెచ్చరిక - మత్స్య సంక్షేమంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టించే సొసైటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పశుసం వర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తలసాని అధ్యక్షత న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మత్స్య సహకార సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఉపసంఘంలో సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఫెడరేషన్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు. మత్స్యకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నూతనంగా గంగ పుత్ర, ముదిరాజ్ కులస్తులకు మాత్రమే సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. కొన్నిచోట్ల సొసైటీల్లో నూతన సభ్యత్వాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని జిల్లాల్లో గంగపుత్రులు లేరని, ముదిరాజ్ కులస్తులే చేపల వృత్తిని కొనసాగిస్తున్నారని, అందు వల్ల చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయన్నా రు. చేపలు పట్టే వారందరూ గంగపుత్రులేన న్న ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామన్నారు. 75 శాతం సబ్సిడీపై వాహనాలు... ఈఏడాది మత్స్యశాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తలసాని చెప్పారు. మత్స్యకారులను దళారుల దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయడంతోనే చేతులు దులుపుకోదని, వాటి ని విక్రయించుకునేందుకు 75శాతం సబ్సిడీ పై వాహనాలను అందిస్తుందన్నారు. ఆధుని క వసతులతో కూడిన మార్కెట్లను నిర్మిం చేందుకు చర్యలను చేపట్టిందన్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో రూ.50లక్షలతో చేపల మార్కెట్లను నిర్మిస్తామన్నారు. మత్స్యకారులు దళారులకు చేపలను విక్రయించి నష్ట పోవద్దని సూచించారు. ఐకమత్యంతో అభి వృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించాలన్నారు. సొసైటీలను బలోపేతం చేసుకోవ డం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్ లో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను చరిత్రలో సువ ర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. -
నేవల్ బేస్ నిర్వాసితులతో కమిటీ
సమస్యల పరిష్కారానికి కమిటీ సూచనలు అందరూ బయోమెట్రిక్ కార్డు తీసుకోవాలి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం కలెక్టర్ యువరాజ్ విశాఖపట్నం : తూర్పు నావికాదళ ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటు కోసం తొలి విడతగా భూములు సేకరించిన ఎస్.రాయవరం, రాంబిల్లి మండాలాల్లోని నాలుగు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసిత గ్రామాల నుంచి ఇద్దరు లేక ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వాసిత గ్రామాల రైతులు, యూనియన్ నాయకులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంగలపూడి అనిత, ఎంపీ అవంతి శ్రీనివాస్, నావికాదళ అధికారులతో సమీక్షించారు. తొలుత నిర్వాసితుల డిమాండ్లు తెలుసుకొని వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలిపారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వారిలో అభద్రత భావం నెలకొందన్నారు. వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ రెండో విడత తన నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్టు పునరావసం కల్పించాల్సి వస్తోందని, ఈసారి ముందుగానే పరిష్కారం చూపాలన్నారు. నేవల్ అధికారులు కేంద్రీయ విద్యాలయంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను నిర్మించాలన్నారు. ఎంపీ ముత్తంశెట్టి మాట్లాడుతూ నావికాదళ స్థావరం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మత్స్యకార కుటుంబీకులు మాట్లాడుతూ చేపల వేట తాము చేపడితే మహిళలు చేపలు అమ్మి జీవనం సాగించేవారని ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా జీవనం కోల్పోయామన్నారు. తమతో పాటు మహిళలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మత్స్యకార సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని, వితంతువులు, 18 ఏళ్లు నిండిన వారిని ఓ కుటుంబంగా గుర్తించి, లక్ష రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొప్పుగుండు పాలెం, వాడ పాలెం గ్రామాలకు కూడా ఈ ప్యాకేజీ వర్తింప చేయాలని కోరారు. వీటిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నిర్వాసితులంతా బయోమెట్రిక్ కార్డుల పొందడం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. దీనిద్వా రా నష్టపరిహారం పంపిణీ సులభతరమవుతుందన్నారు. వితంతువులకు నష్టపరిహారం వర్తింప చేస్తామని, కుటుంబం లో మేజర్లకు కూడా ప్యాకేజీ వర్తింపచేస్తామని, పట్టా భూమితో సమానంగా అసైన్డ్ భూమికి నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందన్నారు. మత్స్యకార కుటుంబాల్లో ఓ మహిళను చేపలు విక్రయదారునిగా గుర్తించి నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ సత్యకుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికల అధికారే గైర్హాజర్!
విజయనగరం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అధికార టిడిపి వారు తలచుకుంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడగలరని మరోసారి రుజువైంది. కొందరు అధికారులు కూడా వారి తొత్తుల్లా వ్యవహరిస్తారనేది స్పష్టమైపోయింది. జిల్లాలోని మత్స్యకార సొసైటీ సంఘానికి ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉంది. అయితే ఈ సొసైటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయించారు. ఏకంగా ఎన్నికలు నిర్వహించవలసిన అధికారే గౌర్హాజరయ్యారు. దాంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాకు గంగపుత్రులు నిరసన తెలిపారు. వారు ఆందోళనకు దిగారు. మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది.