Minister talasani
-
కొనుగోలు ప్రాంతంలోనే గొర్రెల బీమా
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే బీమా చేయించి సంబంధిత పత్రాలు లబ్ధిదారులకు అందజేయాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. ఒకవేళ గొర్రె చనిపోతే 10 రోజుల్లోగా బీమా క్లెయిమ్ చేసి లబ్ధిదారుడికి అందించేలా పథకాన్ని అమలు చేయాలన్నారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, రెండో విడత గొర్రెల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర పశుసంవర్థక శాఖ పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందన్నారు. పెరిగిన జీవాలకనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లేలా సంచార పశు వైద్యశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పెంపకందారులు గొర్రెలు అమ్మి, కొనుక్కునేందుకు త్వరలోనే ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో గొర్రెల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనెల 6 నుంచి 13 వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ నుంచి ప్రారంభిస్తామని తలసాని వెల్లడించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
సినీ కార్మికులకు మంత్రి తలసాని చేయూత
-
పకడ్బందీగా గొర్రెలు, పాడి గేదెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: విభిన్న కార్యక్రమాల అమలుతో దేశంలోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండో విడత గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆలోచనతో రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని, సమిష్టి కృషితో 63 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని యాదవ, కురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేసేందుకు మరో రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. -
ఆగస్టులో గేదెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పాడి గేదెల పంపిణీ విధివిధానాలపై వివిధ జిల్లాల పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి తలసాని, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విజయడెయిరీ, ముల్కనూర్, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మందికి సబ్సిడీపై పాడిగేదెలు, ఆవులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గేదెల కొనుగోలుపై లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించా రు. పంపిణీ చేసే గేదెలకు ఒక్కో దానికి యూనిట్ ధరలో 3 ఏళ్ల పాటు బీమా, 300 కిలోల దాణా ఇస్తామన్నారు. అంతేకాకుండా అదనంగా రూ.5 వేలు చెల్లిస్తామన్నారు. 31 నుంచి చేప పిల్లల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 31న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని వెల్లడించారు. చేప పిల్లల విడుదల ఏర్పాట్లపై సోమ వారం సచివాలయంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, ఇతర మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఘన్పూర్ చెరువులలో తాను స్పీకర్‌తో కలసి చేపపిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి చందులాల్‌తో కలసి ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. చేపపిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విడుదల కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అధికారులకు సూచించారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీపై వాహనాలను ఆగస్టు నెలాఖరు నాటికి అందించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభు త్వం అన్ని విధాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయపర్చుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రాజెక్టు ప్రాంతాల్లో చేపల మార్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీరాంసాగర్, కోయిల్‌సాగర్, మిడ్‌మానేర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో చేపల పెంపక కేంద్రాలు, ల్యాండింగ్ సెంటర్లు, ఫీడ్‌మిల్లులు, చేపల మార్కెట్ల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి(ఎన్ఎఫ్డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి రాణికుముదినిదేవి తెలిపారు. బుధవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలసి మాట్లాడారు. జంట నగరాల్లోని 150 డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నాణ్యమైన చేపల ఆహారం, అమ్మకానికి సంబంధించిన మొబైల్ ఔట్లెట్లకు ఎన్ఎఫ్డీబీ సహకారం అందిస్తుందన్నారు. పాత జిల్లాల్లో 40 చేపల మార్కెట్లు పాత 10 జిల్లాల్లో 40 చేపల మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాల నిర్వహణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. 2018–19 ఏడాదిలో 24,192 నీటి వనరుల్లో 77 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తామని, టెండర్ల ప్రక్రియ సాగుతుందని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది కోటి రొయ్య పిల్లలను పంపిణీ చేశామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతోప్రణాళికలను రూపొందించామన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. -
రైతు బంధు చెక్కు తిరిగిచ్చిన మంత్రి తలసాని
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో తమ కుటుంబానికి ఉన్న 20 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి అందజేసిన రూ.81 వేల రైతు బంధు చెక్కులను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తిరిగి ఇచ్చారు. కొల్తూరులో శనివారం జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి తలసాని తమ చెక్కులను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డికి అందజేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి రైతు బంధు చెక్కులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కొల్తూరుకి చెందిన 600 మంది రైతులకు రూ.78.12 లక్షలకు సంబంధించిన 714 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రండి.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించాలని కోరారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫుడ్ – 2018 ట్రేడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. రెండోరోజు బుధవారం ట్రేడ్‌షోలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక రాయితీలను కూడా కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని మంత్రి వెల్లడించారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రం మాంసం ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామని, వీటి ద్వారా రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గత సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామని వివరించారు. ట్రేడ్‌షోలో మంత్రితోపాటు డెయిరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
1.28 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే భారీ మొత్తంలో గొర్రెలను పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. బుధవారం సచివాలయంలో గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్థకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గొర్రెల కొనుగోలు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిబంధనల మేరకే గొర్రెల కొనుగోలు, పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారులు కారణంగా మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
గొర్రెల పంపిణీకి బ్రేక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గొర్రెల పంచాయితీ రచ్చకెక్కింది. అధికారుల సహాయ నిరాకరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గొర్రెల పంపిణీకి అర్ధంతరంగా బ్రేక్ పడింది. ఇప్పటికే అధిక ధరలు, రీ సైక్లింగ్, సంతలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో తలబొప్పి కట్టిన సర్కారుకు తాజాగా పశుసంవర్థకశాఖ యంత్రాంగం షాక్ ఇచ్చింది. జీవాల కొనుగోళ్లు మొదలు రాష్ట్రానికి తరలించే వరకు బాధ్యత వహించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. సిరిసిల్ల జిల్లాలో జరిగిన అవకతవకలపై ఇద్దరు అధికారులపై వేటు వేసింది. ఈ నిర్ణయమే వెటర్నరీ ఉద్యోగుల సహాయ నిరాకరణకు దారితీసింది. దీంతో వారంరోజులుగా గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా వర్గాలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తోంది. జూలైలో ప్రారంభమైంది. జీవాల కొనుగోలు, జిల్లాకు తరలించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో వీటికి డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గ జీవాల లభ్యత లేకపోవడం.. ఆ జీవాలను తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. సగటున రోజుకు 2025 యూనిట్లు లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా గొర్రెల లభ్యత లేకపోవడంతో.. ప్రతి రోజు సగటున 20 నుంచి 25 యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. జీవాల పంపిణీలో చోటుచేసుకుంటున్న చిన్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తున్నా రని ఆగ్రహించిన పశుసంవర్థకశాఖ అధికారులు గొర్రెల సేకరణకు దూరంగా ఉన్నారు. ఎదురుచూపుల్లో 400 మంది! గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న సదాశయంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి జూలైలో శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. యూనిట్ విలువలో 75 శాతం అనగా రూ.93,750 సబ్సిడీ అందజేస్తోంది. మిగిలిన 25 శాతం (రూ.31,250) లబ్ధిదారులు భరించాలి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 20 వేలమంది లబ్ధిదారులకు డిసెంబర్‌లోగా అందజేయాలి. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 3,407 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. గొర్రెల కొనుగోలుకు కర్ణాటక వెళ్లేందుకు పశువైద్యాధికారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా వారం రోజులుగా ఒక్క యూనిట్ కూడా లబ్ధిదారునికి చేరలేదు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే గొర్రెలను తెచ్చేందుకు ముందుకు సాగుతామని అధికారులు అంటున్నారు. గొర్రెల పంపిణీని సమర్థంగా నిర్వహించండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆయన తన చాంబర్లో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై పశుసంవర్థకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, పశువైద్యాధికారుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. గొర్రెల కొనుగోళ్లలో జరుగుతున్న పొరపాట్లను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధికారులను పంపించి సమాచారం సేకరించాలని మంత్రి డైరెక్టర్‌ను ఆదేశించారు. అలాగే గొర్రెల లభ్యత తగ్గడానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందన్నారు. ఇటీవల ప్రారంభించిన మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల పనితీరును గురించి కూడా ఈ సమావేశంలో తలసాని సమీక్షించారు. -
గొర్రెల రీసైక్లింగ్‌పై కదిలిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్/పుల్కల్: సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్ వ్యవహారంపై ప్రభుత్వం కదిలింది. ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘అటూ ఇటూ అదే గొర్రె, ఎవరు బకరా’శీర్షికన ప్రచురితమైన పరిశోధనాత్మక కథనంపై స్పందించింది. గొర్రెల రీసైక్లింగ్ దందాపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లో సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా వదలబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు కచ్చితంగా ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా గొర్రె లు కొనుగోలు చేయాలన్నా రు. ఇప్పటివరకు సుమారు 1.23 లక్షల యూనిట్ల గొర్రె లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇటీవల లబ్ధిదారులకు అందజేసిన గొర్రెల రీసైక్లింగ్‌పై ప్రాథమిక సమాచారం అందడంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విధివిధానాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్న సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. మామూళ్లు ఇచ్చాకే అమ్ముకున్నాం.. సబ్సిడీ గొర్రెలు అమ్మినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతుండగా.. లబ్ధిదారులు కూడా అంతే ఘాటుగా స్పందించారు. అధికారులకు మామూళ్లు ఇచ్చిన తర్వాతే గొర్రెలు అమ్ముకున్నామని, తమపై చర్యలు తీసుకునే ముందు ఆ అధికారులపై కేసులు పెట్టాలని అంటున్నారు. ‘‘మేం ఊరికే గొర్రెలు అమ్ముకోలేదు. పది మందిమి కలిసి వేర్వేరు శాఖలకు చెందిన అధికారులకు రూ.60 వేల మామూళ్లు ఇచ్చాం. మాకేమైనా అయితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అడుగుతాం’’అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ లబ్ధిదారుడు ‘సాక్షి’తో అన్నాడు. మరోవైపు అధికారులు ఆదివారం పుల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రాథమిక సమాచారం సేకరించారు. గ్రామాల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెలు ఉన్నాయా? ఎన్ని మృతి చెందాయి? తదితర అంశాలపై వివరాలు సేకరించారు. పుల్కల్లో 15 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. -
షహర్ కీ ‘షెహన్షా’
యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతిబింబిస్తూ ప్రతి యేటా నిర్వహించే సదర్ పండుగలో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్ షా’దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సదర్ ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఈ నెల 21న ప్రభుత్వం సదర్‌ను నిర్వహించనుంది. అంతకు ముందు రోజు 20న నగరంలోని వివిధ ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరుగుతాయి. ప్రతి యేడాదిలాగే ఈ సారీ దేశంలోనే బాగా పేరుపొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు జిల్లాల్లో సైతం నిర్వహించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ మంత్రి తలసాని పర్యవేక్షణ.. ఈ నెల 21న అధికారికంగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహించనున్న నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యాదవులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పాటలు, కళా ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21వ తేదీ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. షెహన్షా ప్రత్యేకతలు పేరు: షెహన్షా వయస్సు: నాలుగున్నర ఏళ్లు (2013లో జన్మించింది) బరువు: 1,500 కిలోలు మార్కెట్ ధర: సుమారు రూ.25 కోట్లు షెహన్షా యజమాని: అహ్మద్ ఆలంఖాన్, సత్తర్బాగ్ డెయిరీఫామ్ ఆహారం: ఉదయం, సాయంత్రం 20 లీటర్ల చొప్పున పాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాదం, కాజు, పిస్తా, కర్జూరా వంటి 5 కిలోల మిశ్రమ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు 100 యాపిల్స్, ఒక కిలో నల్లబెల్లం ఇవికాకుండా దాణా, సరిపడా నీళ్లు రోజుకు మూడుసార్లు స్నానం, మూడుసార్లు ఆవనూనెతో మర్దన ఆకట్టుకోనున్న షెహన్షా... ఈ సారి సదర్ ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్షా’కనువిందు చేయనుంది. రెండు, మూడేళ్లుగా హర్యానాకు చెందిన జాతీయస్థాయిలో విశేష గుర్తింపును పొందిన దున్నపోతు ‘యువరాజు’ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా హర్యానాకు చెందిన యువరాజుకే పుట్టిన ‘ధారా,’మరో దున్న ‘రాజు’తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ‘మహరాజ్’ను కూడా ప్రదర్శిస్తారు. అలాగే ‘షెహన్షా’సైతం హర్యానాకు చెందిన మరో దున్న ‘రుస్తుం’సంతతేనని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్‌లోని సత్తర్‌బాగ్‌లో ఈ దున్నను ప్రదర్శించారు. ‘‘ప్రతి సంవత్సరం హర్యానా, పంజాబ్‌ల నుంచి దున్నలను తెప్పించేవాళ్లం. కానీ మొట్టమొదటిసారి హైదరాబాద్‌కే చెందిన ముర్రా జాతి దున్న షెహన్షా ఈ సారి ప్రదర్శనలో పాల్గొనబోతోంది’’అని చెప్పారు హరిబాబు. -
చేపల మృతికి కారణమైన కంపెనీలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంటే.. పలు కంపెనీలు కలుషిత జలాలు చెరువులోకి వదిలి చేపల మృతికి కారణమవుతున్నాయని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శుక్రవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గండిచెరువు లోకి కలుషిత నీటిని వదిలిన కంపెనీలను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ జిల్లా అధికారులను ఆదేశించారు. 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గండిచెరువులో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు కలవడం వలనే రూ.1.50 కోట్ల విలువైన చేపలు మృతిచెందాయని పేర్కొన్నారు. -
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు, రీసైక్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. అవకతవకలను నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవకతవకలు జరిగితే 1800 599 3699 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులపై తక్షణమే అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపడతారన్నారు. గొర్రెల పంపిణీ పథకం, గొర్రెలకు బీమా సౌకర్యం అమలుపై పశుసంవర్ధకశాఖ అధికారులతో సచివాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధకశాఖ, విజిలెన్స్ అధికారులు టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 23,80,518 గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరణించిన గొర్రెలకు బీమా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. -
చెరువులో పోస్తుండగానే చేప పిల్లలు మృతి
సాక్షి, కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యంతో రెండు లక్షలకు పైగా చేప పిల్లలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగ భూపాలెం చెరువు లో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం చేప పిల్లలు పోశారు. కార్యక్రమం ముగిం చుకుని ఆయన వెనుదిరిగి వెళుతుండగానే సుమారు రెండు లక్షల చేపపిల్లలు మృత్యువాత పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మత్స్య సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటైన సింగభూపాలెంలో 7.20 లక్షల చేపపిల్లలు వేయాలని నిర్ణయించారు. ఈ చెరువులో 80 నుంచి 100 ఎంఎం సైజు కలిగిన పిల్లలు పోయాలని నిర్ణయించగా, వచ్చినవాటిలో అత్యధికం 35 నుంచి 40 ఎంఎం సైజు చేపపిల్లలే కావడం గమనార్హం. మంత్రి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉండటంతో అప్పటికే చేప పిల్లలను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నీరు పోసి అందులో ఉంచారు. అయితే నీరు వేడెక్కడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని మత్స్యశాఖ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
సినిమాలకు.. సింగిల్ విండో!
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని - దసరాకు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం - చిన్న సినిమాలకు ఐదో ఆటకు అనుమతిలో జాప్యం వద్దు.. - బ్లాక్‌ను అరికట్టేందుకు ఆన్లైన్ టికెటింగ్ సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర నిర్మాణానికి వివిధ శాఖల నుంచి అనుమతులు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి సింగిల్ విండో సిస్టమ్‌ను అమల్లోకి తెస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రక్రియను దసరా పండుగ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారులతో చర్చించారు. చలనచిత్ర నిర్మాణాలకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు నిర్మాతలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని, కాలయాపన జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్లాక్ టికెటింగ్‌ను నిరోధించేందుకు ఆన్లైన్ టికెట్ విధానాన్ని అన్ని థియేటర్లలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే జిల్లాల్లోని సంబంధిత అధికారులకు, రాష్ట్రంలోని 437 థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం పంపినట్లు వివరించారు. 100 ఎకరాల్లో.. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి అనువైన 100 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో గుర్తించామని తలసాని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. 200 నుంచి 300 సీట్ల సామర్థ్యమున్న మినీ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో థియేటర్లలో ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు. చిన్న బడ్జెట్ చిత్రాల అర్హతను 35 నుంచి 100 స్క్రీన్లకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బాలల చలనచిత్ర ఉత్సవాల కోసం రూ.8 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. -
రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
- 77 రిజర్వాయర్లు... 20 వేల చెరువుల్లో వేసేందుకు ఏర్పాట్లు - మొత్తం 69.66 కోట్ల చేపలను పంపిణీ చేస్తాం: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో చేప పిల్లలను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామపంచాయతీ చెరువుల్లో మొత్తం 69.66 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నామని చెప్పారు. గతేడాది రిజర్వాయర్లు, ప్రభుత్వ చెరువుల్లో 29 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పున రావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరుతూ లేఖలు రాయనున్నట్లు వివరించారు. చేపల విడుదల వీడియో చిత్రీకరణ.. : అవసరమైన చేప పిల్లలను ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కొనుగోలు చేసినట్లు మంత్రి తలసాని చెప్పారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేసే ప్రక్రియను వీడియో చిత్రీకరణ జరపాలని, నిబంధనల మేరకు లేని చేపపిల్లలను తిరస్కరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మత్స్యశాఖలో సరిపడా సిబ్బంది లేనందున చేపపిల్లల పంపిణీలో పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. సబ్సిడీపై వాహనాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలో నూతన మత్స్య సొసైటీలు.. అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించి 31 జిల్లాలకుగాను నూతన మత్స్య సొసైటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3,831 సొసైటీల్లో 2,79,871 మంది సభ్యులు ఉన్నారన్నారు. గొర్రెల పంపకందారులకు ఇప్పటివరకు 14.76 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. 100 సంచార పశువైద్య వాహనాలను త్వరలోనే సీఎంతో ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో లబ్ధిదారులు గొర్రెలను విక్రయించినట్లు ఫిర్యాదు రావడంతో వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొర్రెల కొనుగోలుకు టెండర్లు పిలవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. -
బోన‘భాగ్యం’
ఘనంగా లష్కర్ బోనాలు - ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు - ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహిమాన్విత శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళిని దర్శించుకునేందుకు నగరం నలువైపుల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి వరకూ భక్తులు బోనాలు సమర్పించారు. సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు బోనాలు సమర్పించినట్లు అంచనా. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఉదయం 4.05 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించి వేడుకలను ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు సాయంత్రం ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ కె.మధుసూదనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పద్మారావుగౌడ్ దంపతులు, ఎంపీ కవిత, మల్లారెడ్డి, కె.కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సాయన్న, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, నంది ఎల్లయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చి పూజలు చేసే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈసారి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి శోభ, కుమార్తె కవితలు మంత్రి పద్మారావు ఇంటి వద్ద నుంచి అమ్మవారి దేవాలయానికి వచ్చారు. అనంతరం మంత్రి ఇంటికి వెళ్లి బోనాల విందులో పాల్గొన్నారు. ఘనంగా ఏర్పాట్లు... తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్స వాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది బోనాల కోసం రూ.10 కోట్లు వెచ్చించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు రంగం... బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. అవివాహిత మహిళ స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని దేశ భవిష్యత్‌కు సంబంధించి భవిష్యవాణి వినిపిస్తారు. దత్తాత్రేయకు చేదు అనుభవం అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయమే కేంద్ర మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌కు వచ్చారు. అయితే అప్పటికే భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఆయన కాన్వాయ్‌ను ఆలయం వద్దకు వెళ్లకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీంతో రాంగోపాల్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆలయం వరకు ఆయన సతీమణితో కలసి నడుచుకుంటూ వచ్చారు. పోలీసుల తీరు పట్ల దత్తాత్రేయ అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
1.5 లక్షల మందికి చేప ప్రసాదం
- ముగిసిన చేప ప్రసాద వితరణ - 4 ప్రత్యేక కేంద్రాల్లో ప్రసాదం నేడు, రేపు హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం బత్తిన సోదరులు చేపట్టిన చేప ప్రసాద వితరణ ముగిసింది. గురువారం ఉదయం 9 గంటలకు మృగశిర కార్తె ఆరంభాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు చేప ప్రసాదాన్ని భక్తులకు అందచేశారు. సుమారు ఒకటిన్నర లక్షల మందికి చేప ప్రసాదం అందజేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా నిర్విరామంగా 32 కౌంటర్లలో ప్రసాదాన్ని రోగులకు అందజేశారు. రాత్రి 7 గంటలకే వీఐపీ కేంద్రాలు మూసివేయడంతో కొందరు వీఐపీ పాసు కలిగిన రోగులు జనరల్ కౌంటర్లలోనే క్యూలో నిల్చోని ప్రసాదాన్ని స్వీకరించారు. అయితే, నగరంలోని కవాడీగూడ, కూకట్పల్లి, వనస్థలిపురం, దూద్‌బౌలిలో మరో రెండు రోజులపాటు చేపప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. ప్రసాదం వితరణ విజయవంతంగా ముగిసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి రోగులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు. ఐదో తరాన్ని సిద్ధం చేశాం: హరినాథ్ గౌడ్ తాము నాలుగు తరాలుగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నామని, తాను నాల్గవ తరానికి చెందిన వాడినని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేపప్రసాదం పంపిణీకి వచ్చే తరాన్ని సంసిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ మందు ఆస్తమా ఉన్నవారికి ఒక ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ విజయవంతం: తలసాని బత్తిన సోదరులు ప్రారంభించిన చేప ప్రసాదం పంపిణీ విజయవంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నా రు. చేప ప్రసాదం పంపిణీకి సహకరించిన బత్తిన సోదరులు, జీహెచ్ఎంసీ, పోలీసులు, మెట్రో వాటర్ వర్క్స్, మెడికల్, విద్యుత్, రెవెన్యూ, ఎగ్జిబిషన్ సొసైటీ, మత్య్సశాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు రోగులకు భోజనం సౌకర్యం కల్పించినందుకు అభినందనలు తెలిపారు. -
గడ్డాలు పెంచుకున్నా అధికారం రాదు
కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఫైర్ పరిగి: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆ పార్టీలో ఉన్నవారంతా గడ్డాలు పెంచుకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ మేమే అధికారం చేపడతాం’ అని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం పరిగిలో గొల్ల కురుమల ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలో 6.5 లక్షల మంది లబ్ధిదారులకు 1.3 కోట్ల గొర్రెలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గతంలో జరిగిందంతా దొంగల పాలనేనని అన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఓ అబద్ధాల కోరని, కొడంగల్ పొట్టి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సూట్‌కేసులు తీసుకెళ్లి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగ అని విమర్శించారు. -
‘భూమాయ’లో మంత్రి తలసాని హస్తం
సీబీఐ విచారణకు ఆదేశించాలి: దిగ్విజయ్ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. బహుశా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి డబ్బుల వసూలు కోసమే శ్రీనివాసయాదవ్లాంటి వ్యక్తులు అవసరమేమోనని వ్యాఖ్యానించారు. ఈ భూకుంభకోణంలో కేసీఆర్ సర్కారు సరైన విచారణ జరుపుతుందన్న నమ్మకం లేదని.. అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే భూములపై కాంగ్రెస్ హయాం నుంచీ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ప్రమేయముందని దిగ్విజయ్ ఆరోపించారు. అధికారుల అండతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. భూదాన్ భూములు ఏమయ్యాయో, మిగిలిన భూములు ఎక్కడ, ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూములు కూడా అదే కోవలో మాయవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో సబ్రిజిస్ట్రార్లను బదిలీ చేశారుగానీ ముఖ్య నాయకులను వదిలేశారని వ్యాఖ్యానించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులోనూ పోలీసుల మీద చర్య తీసుకుని రాజకీయ నాయకులను వదిలేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం: 2019లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని, అసెంబ్లీ సీట్ల వారీగా సూక్ష్మ పరిశీలన చేస్తున్నామని దిగ్విజయ్ తెలిపారు. మొత్తం 119 సీట్లకు పోటీ చేస్తామన్నారు. ఏపీలో తాము టీడీపీని వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలోనూ టీడీపీ అవసరం లేదని.. ఈ విషయంలో సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందని, అనేక చేరికలు ఉంటాయని ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ కార్డును ఉపయోగించి ఓట్లు చీల్చాలనేది బీజేపీ ప్రయత్నమని విమర్శించారు. -
కొడంగల్.. సనత్‌నగర్.. ఎక్కడైనా రెడీ
రేవంత్‌కు తలసాని సవాల్ కొడంగల్: ‘కొడంగల్ లేదా.. సనత్‌నగర్‌లో ఎక్కడైనా సరే పోటీకి సిద్ధం.. ఓడిపోయిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’ అని రేవంత్‌రెడ్డికి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. ఆదివారం కొడంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్.. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కుదరదు.. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ ద్రోహులతో జతకట్టి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరన్నారు. -
ప్రజల సంక్షేమం పట్టని కాంగ్రెస్
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సాక్షి, వనపర్తి: కాంగ్రెస్‌పార్టీ నేతలు ఏ రోజూ ప్రజల సంక్షేమం గురించి పట్టించు కోలే దని రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధ వారం వనపర్తిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గొర్రెలకాపరుల అవగాహన కార్యక్ర మంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలస జిల్లాగా పేరున్న ఉమ్మడి పాలమూరు లో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలి పారు. గొల్ల, కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వాటిని శాశ్వతంగా దూరం గా చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోం దన్నారు. -
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
- ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు - వెల్లడించిన బత్తిని సోదరులు హైదరాబాద్: ఉచిత చేప ప్రసాదాన్ని జూన్ 8న ఉదయం 6 గంటలకు పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు విశ్వనాథం గౌడ్, హరినాథ్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఉబ్బస వ్యాధి గ్రస్తులకు పాతబస్తీలోని దూద్‌బౌలిలో బత్తిని వంశం ఆధ్వర్యంలో ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం బత్తిని సోదరులు సాక్షితో మాట్లాడుతూ... జూన్ 8న దూద్‌బౌలి లోని తమ నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లక్షలాది మంది చేప మందు సేవించేందుకు విచ్చేస్తారని, వారి కోసం ప్రభుత్వం తరఫు న అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయని బత్తిని సోదరులు తెలిపారు. దూద్‌బౌలిలోని తమ ఇంట్లో 8, 9న చేపమందు పంపిణీ చేస్తామన్నారు. ఈ చేప ప్రసాదాన్ని ఉచి తంగా పంపిణీ చేస్తున్నామని, నకిలీ చేప ప్రసాదం పంపి ణీ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష ఉచిత చేప మందు పంపిణీ కోసం లక్ష చేప పిల్లలను సిద్ధం చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జూన్ 8న నిర్వహించనున్న చేప మందు పంపిణీ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, బత్తిని సోదరులు అందించే చేప మందు కోసం నగరంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. దూర ప్రాంతాల వారి కోసం 110 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు చెప్పా రు. హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడంతో పాటు నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ మైదానానికి చేపల సరఫరా కోసం మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలని, బారికేడ్లను అమర్చాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు
- మత్స్యకారుల సొసైటీలకు మంత్రి తలసాని హెచ్చరిక - మత్స్య సంక్షేమంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సభ్యత్వాలకు అడ్డంకులు సృష్టించే సొసైటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పశుసం వర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తలసాని అధ్యక్షత న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మత్స్య సహకార సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఉపసంఘంలో సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఫెడరేషన్ ఎండీ సురేందర్ పాల్గొన్నారు. మత్స్యకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నూతనంగా గంగ పుత్ర, ముదిరాజ్ కులస్తులకు మాత్రమే సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. కొన్నిచోట్ల సొసైటీల్లో నూతన సభ్యత్వాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని జిల్లాల్లో గంగపుత్రులు లేరని, ముదిరాజ్ కులస్తులే చేపల వృత్తిని కొనసాగిస్తున్నారని, అందు వల్ల చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయన్నా రు. చేపలు పట్టే వారందరూ గంగపుత్రులేన న్న ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామన్నారు. 75 శాతం సబ్సిడీపై వాహనాలు... ఈఏడాది మత్స్యశాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తలసాని చెప్పారు. మత్స్యకారులను దళారుల దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయడంతోనే చేతులు దులుపుకోదని, వాటి ని విక్రయించుకునేందుకు 75శాతం సబ్సిడీ పై వాహనాలను అందిస్తుందన్నారు. ఆధుని క వసతులతో కూడిన మార్కెట్లను నిర్మిం చేందుకు చర్యలను చేపట్టిందన్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో రూ.50లక్షలతో చేపల మార్కెట్లను నిర్మిస్తామన్నారు. మత్స్యకారులు దళారులకు చేపలను విక్రయించి నష్ట పోవద్దని సూచించారు. ఐకమత్యంతో అభి వృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించాలన్నారు. సొసైటీలను బలోపేతం చేసుకోవ డం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్ లో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను చరిత్రలో సువ ర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. -
నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమానికి విధివిధానాలు రూపొందించేందుకుగాను సలహాలుస్వీకరించేందుకు మత్స్య సహకార సొసైటీలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం జరుగుతుంది. -
మూటలు మోసిన కవిత
ధర్మపురి: టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత కూలీ పని చేశారు. ఓ రైస్ మిల్లో మూటలు మోశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవితలు మంగళవారం వచ్చారు. వీరు ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో బియ్యం మూటలు మోసారు. ఇందుకు తలసాని, కవిత రూ. 50 వేలు సంపాదించారు. -
309 సహాయ పశువైద్యుల పోస్టులు భర్తీ
గొర్రెల పథకం నోడల్ అధికారిగా కలెక్టర్: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశు సంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 309 సహాయ పశువైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో గొర్రెల పంపిణీ పథకం అమలుకు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. గొర్రెల కొనుగోలు కోసం విధివిధానాలను రూపొందించేందుకు శుక్రవారం సచివాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు. గొర్రెలు లేని 18 సంవత్సరాలు పైబడిన గొల్ల, కుర్మ కులస్తులందరినీ సొసైటీలలో సభ్యులుగా నమోదు చేయించాలని మంత్రి సూచించారు.గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపికను లాటరీ ద్వారా చేపట్టాలని, సగం మంది మొదటి సంవత్సరం, మిగిలిన సగం మంది రెండో సంవత్సరం లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారి నుంచి యూనిట్ విలువలో 25 శాతం ముందుగా మండలస్థాయిలో త్రిసభ్య కమిటీ వసూలు చేస్తే, దానికి 75 శాతం విలువను ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. మండలస్థాయి త్రిసభ్య కమిటీ కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అటవీశాఖ భూముల్లో స్టైలోరకం గడ్డిని పెంచేవిధంగా చర్యలు చేపట్టాలని, పశుసంవర్థక శాఖ, ఉద్యానశాఖ సమన్వయంతో పండ్ల తోటల్లో పశుగ్రాసం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలల ద్వారా గొర్రెల మంద వద్దనే వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, పశువైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ 15 రోజుల్లో గ్రామస్థాయి లబ్ధిదారుల ఎంపిక విషయమై గొల్ల, కుర్మ కులస్తుల కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటికే వారికున్న గొర్రెలు, ఆధార్‌కార్డు నంబర్, వారి భూముల సమాచారం సేకరిస్తుందని వివరించారు. -
ప్రజల అవసరాల్ని గుర్తించింది మా సర్కారే
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని అడుక్కునేలా చేశారు: తలసాని సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ రిమోట్ ప్రజల వద్ద ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. రెండున్నరేళ్లలో చరిత్రాత్మక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాది. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని అడుక్కునేలా చేశారు. కాంగ్రెస్ చేయనిది మేం రెండున్నరేళ్లలో చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేనందునే కాంగ్రెస్ వాళ్లను సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని పేర్కొన్నారు. నోరు ఉందని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. -
మత్స్యకారుల అభ్యున్నతికి రూ.101 కోట్ల బడ్జెట్
అసెంబ్లీలో మంత్రి తలసాని వెల్లడి - గ్రామాల్లోని ప్రతి చెరువు, అన్ని రిజర్వాయర్లలో చేపల పెంపకం - రాష్ట్రంలో 100 రిటైల్ చేపల మార్కెట్ల నిర్మాణానికి చర్యలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి తమ ప్రభుత్వం అధిక బడ్జెట్‌ను కేటాయించిందని, రూ. 101 కోట్లు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలి పారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమాభివృద్ధిపై శుక్రవారం అసెంబ్లీలో లఘు చర్చ సందర్భం గా మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య పరి శ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శ్రీనివాస్ యాదవ్ వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామం లో చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకా నికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.36.35 కోట్ల అంచనా వ్యయంతో 40.39 కోట్ల చేప పిల్లలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 74 రిజర్వాయర్లు, 4,324 శాఖాపరమైన చెరువులు, 19,746 గ్రామ పంచాయతీ చెరు వుల్లో వీటిని పెంచనున్నట్లు మంత్రి వివరిం చారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ మత్య్స పరిశ్రమాభివృద్ధి బోర్డు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధి, వ్యవసాయ మార్కెట్ కమిటీల కింద రాష్ట్రంలో 33 చేపల రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 100 రిటైల్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వాటికి స్థలాలను గుర్తించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, మత్స్యశాఖ అధికారులకు సూచించినట్లు తెలి పారు. ఎమ్మెల్యేలు కూడా ఇందుకు స్థలాలను సూచించాలని వెల్లడించారు. ఇక టోకుగా చేపల మార్కెటింగ్‌ను పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న మధ్యవర్తుల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని 11 రిటైల్ కేంద్రాల ద్వారా చేపల విక్రయాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులోని 9 కేంద్రాల్లో నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 3,977 మత్స్య సహకార సంఘాలలో 3,26,154 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారుల సహకార సంఘాలలో అర్హులైన అందరికి సభ్యత్వం కల్పించేందుకు, కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. 100 శాతం గ్రాంటుతో చేప పిల్లల సరఫరా కోసం రూ.48.35 కోట్లను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. మత్స్యకారులకు మెరుగైన ధరలు లభించేందుకు మార్కెట్ల అనుసంధానం, కొనుగోలుదారులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం స్పీకర్ సభను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున తదుపరి చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. సీఎం రెండడిగితే నాలుగిస్తారు సాక్షి, హైదరాబాద్: ‘మన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండడిగితే నాలుగిస్తారు. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు లీటరుకు రూ. 2 ప్రోత్సాహకం కోరగా.. సీఎం ఏకంగా రూ. 4 ఇస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు’ అని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. పశు వైద్య అధికారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయంలో 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక, మత్స్యశాఖలు పనికి మాలినవిగా గతంలో అనుకునే వారని.. కానీ వీటి ప్రాముఖ్యతను సీఎం గుర్తించారన్నారు. పశుసంవర్ధక శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారన్నారు. గోపాలమిత్రలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నాటికి సంచార వైద్య శాలలను ప్రతీ నియోజకవర్గంలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అలాగే రూ. 400 కోట్ల జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రుణం మంజూరైందన్నారు. 462 వెటర్నరీ కాంపొండర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ‘పడమటి సంధ్యారాగం లండన్‌లో’ చిత్ర పరిచయం గణేష్ క్రియేషన్స్ బ్యానర్‌పై లండన్ గణేష్ నిర్మాతగా, వంశీ మునిగంటి దర్శకుడిగా ‘పడమటి సంధ్యారాగం లండన్‌లో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాన్ని మంత్రి తలసాని సచివా లయంలో విలేకరుల ముందు పరిచయం చేశారు. -
మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రభుత్వ స్కూళ్లలో వసతులకు 235 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం, ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడం, ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న తల్లిదండ్రుల ఆలోచన వల్ల ఏటా లక్షన్నర మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ కట్టి, మెయిం టెనెన్స్ కింద రూ. 60 కోట్ల చొప్పున, హైస్కూళ్లకు రూ. లక్ష, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50 వేల చొప్పున నిధులిస్తున్నామన్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేశామని ఈ అంశంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సభ్యులు పూల రవీందర్, రామచంద్రారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్, పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. టీచర్ల పనితీరు బాగోలేదు: షబ్బీర్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, స్కూళ్లకు రాకుండానే సంతకాలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉప్పల్వాయిలో ఓ హెడ్మాస్టర్ 29 రోజులు పాఠశాలకు రాకున్నా వచ్చినట్లుగా సంతకాలు పెట్టారని.. ఇలా అనేక పాఠశాలల్లో జరుగుతోందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం.. దేశంలోనే చివరి స్థానంలో ఉందని, దాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో విత్తన చట్టం: పోచారం నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు త్వరలోనే విత్తన చట్టాన్ని తీసుకురానున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ మిరప విత్తన విక్రయదారులపై ఇప్పటికే కఠినంగా వ్యవ హరిస్తున్నామని, పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 8,171 మంది రైతులు నష్టపోయారని, 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దీనికి కారణమైన 130 మంది విత్తన డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేసి 17 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 2,556 మంది రైతులకు రూ. 1.57 కోట్ల నష్ట పరిహారం చెల్లించామన్నారు. హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్లైన్లు: కేటీఆర్ కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరా పెంచేందుకు హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నీటిసరఫరా సేవలను విస్తరించేందుకు అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కూకట్æపల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు సర్కిళ్లలో ఫీడర్ మెయిన్‌తో పాటు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయన్నారు. 2018 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. విడిగా నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు రాష్ట్రంలో నాన్‌వెజ్ మార్కెట్‌ను విడిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. రాష్ట్రంలో చేపలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చేపల పెంపకం, వాటిని మార్కెట్ చేయడానికి తగిన ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. -
నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి తలసాని
-
నెలాఖరు లోగా పూర్తి చేయాలి
చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియపై మంత్రి తలసాని ఆదేశం సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. విధివిధానాల రూపకల్పనపై మంత్రి శుక్రవారం తన చాంబర్లో మత్స్యశాఖ అధికారులు, ఫెడరేషన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ప్రక్రియను తొలగించి జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన దరిమిలా గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షార్ట్ నోటీస్ టెండర్ ప్రక్రియ విధివిధానాలపై మంత్రి సమీక్షించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఆరోగ్యవంతమైన చేప పిల్లల సరఫరాకు చేపట్టాల్సిన విధివిధానాలను చర్చించారు. సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యారేజీలపై తుది ఒప్పందం నేడే
సాక్షి, హైదరాబాద్ : తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణల మధ్య తుది ఒప్పందం జరుగనుంది. గోదావరిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి, పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు సంతకాలు చేయనున్నారు. మహారాష్ట్రలో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో మంగళవారం ఈ కార్యక్రమం జరుగనుంది. కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరుకానున్నారు. మేడిగడ్డ 100 మీటర్లే!: ఈ ఏడాది మార్చి 8న కుదిరిన ప్రాథమిక ఒప్పందం మేరకు ఏర్పాటైన అధికారుల స్థాయి స్టాండింగ్ కమిటీ.. 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. మేడిగడ్డపై మాత్రం స్పష్టత రాలేదు. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకరించిన మహారాష్ట్ర.. జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు ఒకే చెబుతామని పేర్కొంది. అయితే 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్లతో బ్యారేజీ నిర్మాణానికి మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో అంగీకారం తెలుపుతారని... ఈ మేరకు 16 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరటపై ఎలాంటి అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర ఇప్పటికే స్పష్టం చేసింది. మరో రెండు బ్యారేజీలు పింపార్డ్, రాజాపేటలకు సంబంధించి సాంకేతిక అంశాలను పూర్తి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా.. వాటిపై డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున ఒప్పంద పత్రాల్లో చేర్చలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 24న ఘన స్వాగతానికి ఏర్పాట్లు మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం రాష్ట్ర బృందం 24న రాష్ట్రానికి రానుంది. ఈ సమయంలో వారికి ఘన స్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించేలా టీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వాగత ఏర్పాట్లపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం నగరానికి వచ్చే సీఎంకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఘనంగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రభుత్వం పరంగా చేయాల్సిన సమన్వయంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం అధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయాన్ని సందర్శించి పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్, వాటర్‌వర్స్క్, జీహెచ్ఎంసీ, సాంస్కృతిక, రెవెన్యూ అధికారులతో చర్చించారు. రైతులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరవుతున్నందున బందోబస్తు, పారిశుధ్యం, తాగునీరు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆకట్టుకునేలా వివిధ కళా ప్రదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. -
త్వరలో నంది అవార్డుల పేరు మార్పు
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే 'నంది' పురస్కారాల పేరు మారనుంది. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పేరుతో సినీ అవార్డులను ప్రదానం చేయనుంది. త్వరలో నంది అవార్డుల పేరు మార్చనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ఫష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదే నంది అవార్డుల పేరు మారుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ విషయమై రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యిందని, అవార్డుల పేరు మార్పుపై రమణాచారి కమిటీదే నిర్ణయమని అన్నారు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట్లో బంగారు, రజత, కాంస్య నంది అనే 3 బహుమతులు, కథకు 2 బహుమతులు.. మొత్తము 5 పురస్కారాలు మాత్రమే ఉండేవి. చిత్ర నిర్మాణములో ఉన్న శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ప్రస్తుతం అన్ని విభాగాలకు నంది పురస్కారాలను అందజేస్తున్నారు. ఇక నుంచి ఈ నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అవార్డులుగా మాత్రమే కొనసాగుతాయి. -
బాబాను దర్శించుకున్న మంత్రి తలసాని
-
పశువీర్య ఉత్పత్తికి బ్రెజిల్ టెక్నాలజీ: తలసాని
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పశు వీర్య ఉత్పత్తి కేంద్రానికి బ్రెజిల్లో అమలవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. పశు గణాభివృద్ధి, కళలు తదితర రంగాల్లో బ్రెజిల్‌తో కలసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు త్వరలో బ్రబెజిల్తో ఎంవోయూ కుదుర్చుకొంటామన్నారు.సచివాలయంలో మంగళవారం తలసానితో బ్రెజిల్ వ్యవసా య మంత్రి జోడో క్రూస్ రైస్ ఫిలాహో బృందం సమావేశమైంది. తలసాని మాట్లాడుతూ.. బ్రెజిల్లో 21 కోట్ల జనాభా ఉండగా అదే మొత్తంలో పశుసంపద ఉందన్నారు. మన దేశ పశు జాతులైన ఒంగోలు, గిర్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా బ్రెజిల్ పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. రాష్ట్రంలో పశు గణాభివృద్ధికి, గొర్రెలు, మేకల పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని బ్రెజిల్ ప్రతినిధి బృందానికి వివరించినట్లు చెప్పారు. -
తలసానిని కలసిన ఫిలిం చాంబర్ సభ్యులు
సినీ, టీవీ వాహనాల ఓనర్ల అసోసియేషన్‌తో ఇబ్బందులపై ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌తో కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు, సభ్యులు దిల్‌రాజు, కె.ఎల్. దామోదర ప్రసాద్, శివరామకృష్ణ, రవికిశోర్, ప్రసాద్ తదితరులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌కు తమ ఫెడరేషన్లో గుర్తింపు లేదని, షూటింగ్‌లకు వచ్చే వాహనాలను అడ్డుకుంటూ అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ లొకేషన్లను ధ్వంసం చేశారని, వారి ఆగడాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంపై తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మంగళవారం చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. -
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే 8 శాతం రాయితీ
వాణిజ్య పన్నుల సబ్ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ముందస్తు పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు అవి చెల్లించే పన్నులో 8 శాతం రాయితీ ఇవ్వాలని వాణిజ్యపన్నులపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (సబ్ కమిటీ) నిర్ణయించింది. 2016 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా రూ. 252 కోట్ల మేర వార్షికాదాయం సమకూరుతుందని అంచనా వేసింది. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాకో డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల పన్నుల వసూళ్లు మరింత వేగవంతమవుతాయని, జీరో దందా తగ్గుతుందని మంత్రులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అవసరమైతే ఇద్దరు ఐఏఎస్ అధికారులను డీసీ హోదాలో నియమించాలని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ- ఆంధ్ర సరిహద్ధుల్లో ఉన్న ఏడు కొత్త చెక్‌పోస్టులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న మరో ఏడు చెక్‌పోస్టులను ఏకకాలంలో ఆధునీకరించేందుకు టెండర్లు పిలవాలని, భూసేకరణతో పాటు నిర్మాణం పూర్తి చేసి వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ఆయా సంస్థలకే బీవోటీ పద్ధతిలో ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. అదనపు సిబ్బందిని నియమించాలన్న అధికారుల కోరిక మేరకు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ ద్వారా నియమించుకోవడం, అవసరమైతే సర్వీస్ కమిషన్ నుంచి నియామకాలు చేపట్టేందుకు ఉపసంఘం అనుమతిచ్చింది. మొజాంజాహి మార్కెట్లోని మార్కెటింగ్ శాఖకు చెందిన భవనం, బంజారాహిల్స్‌లోని నీటిపారుదల శాఖ భవనాలను వాణిజ్యపన్నుల శాఖకు అద్దెకిస్తామని మంత్రి హరీశ్‌రావు కమిటీ సభ్యులకు సూచించారు. సనత్‌నగర్‌లో కాలుష్య నియంత్రణమండలి స్థలం కూడా అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. -
ఎస్‌హెచ్‌జీల రుణం రూ.10 లక్షలకు పెంపు
పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: స్వయం సహాయ మహిళా సం ఘాలకు(ఎస్‌హెచ్‌జీలకు) ఇస్తున్న రూ.5లక్షల ను రూ.10లక్షలకు పెంచనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం త్వరలోనే దీన్ని ప్రకటిస్తారన్నారు. జీహెచ్ంఎసీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమం శని వారం నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పడు అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు.. ఇప్పుడు ఏ మాత్రం ఓపిక లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్న చివరి ముఖ్యమంత్రి పరిస్థితే నేడు అంధకారంగా మారిం దన్నారు. బ్యాంకు రుణాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర పథకాల కోసం దళారుల మాటలు నమ్మవద్దని చెప్పారు. అడిగినవారందరికీ లేదనకుండా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ నగరాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ దళారీ వ్యవస్థను మహిళలే తరిమికొట్టాలన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మహిళలంతా ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలు రాబట్టుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎమ్మె ల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సలీం, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెప్మా ఎండీ దాన కిశోర్, సీఆర్వో బాలమాయాదేవి తదితరులు పాల్గొన్నారు. వృత్తినైపుణ్య వర్సిటీకి కృషి మహిళల కోసం దేశవ్యాప్తంగా 8 జాతీయ వృత్తి నైపుణ్య మహిళా వర్సి టీలు ఏర్పాటు కానున్నాయని కార్యక్ర మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు. టీ-సర్కార్ ముందు కొస్తే అందులో ఒకటి హైదరాబాద్‌లో నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌లో నిర్మిం చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నింటికీ కేంద్ర సహకారం ఉంటుందని, ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షలు ఇస్తామన్నారు. మహిళా గ్రూపులకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి బస్తీలో మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్లు నిర్మిస్తే కేంద్రం తరపున మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. -
తలసాని అనర్హతపై నేడు కోర్టులో విచారణ
-
'క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు, ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలు భవిష్యత్‌లో ఉండవని, ఇదే ఆఖరి అవకాశం అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బోయిన్‌పల్లిలోని కూరగాయల రిటైల్ మార్కెట్ గుండా కోజా ముస్లిం గ్రేవ్ యార్డుకు వెళ్లే దారి వివాదం నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను డబ్బులు వసూలు చేయాలన్న భావన తో కాకుండా పేదలకు న్యాయం జరిగేలా వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, ఈ నేపథ్యంలో ఆయా పథకాల ద్వారా క్రమబద్ధీకరణ కోసం పేదల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణలతోనే తంటా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని తలసాని తెలిపారు. ఇందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. 1.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా మొత్తం 425 యూనిట్లలో రెండు విడతలుగా చేపట్టిన కార్యక్రమాల్లో గుర్తించిన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు రూ.200 కోట్లతో వివిధ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్‌లో నాలాలు, రోడ్లు ఆక్రమణలకు గురికావడం అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. వీలైనంత వరకు ఆయా స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నాలు చేస్తామని, అదే సమయంలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూమ్ స్కీము ద్వారా పునరావాసం కల్పిస్తామన్నారు. బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ యార్డులో పేదలకు అన్యాయం జరగని రీతిలో కోజా ముస్లిం గ్రేవ్ యార్డుకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. -
ఢిల్లీలో గవర్నర్‌తో ఏపీ సీఎం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో గత కొద్దికాలంగా దూరదూరంగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయనతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉం డేందుకు వీలుగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, కేంద్ర వైఖరి, న్యాయ వివాదాలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. తలసాని రాజీనామా స్పీకర్ పరిధిలో ఉంది: గవర్నర్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చిన అంశం స్పీకర్ పరిధిలో ఉందని నరసింహన్ స్పష్టం చేశారు. ఆయన రాజీనామా సమర్పించినట్టుగానే తన వద్ద సమాచారం ఉందని వివరించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షితో దాదాపు గంటన్నరపాటు సమావేశం అయిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేకం కానీ, సంచలనం కానీ ఏమీ లేదు. ఈ రోజు రాష్ట్రపతిని కలిశాను. హోం మంత్రిని కలిశాను. మంగళవారం రక్షణ శాఖ మంత్రిని కలుస్తాను..’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ‘అంతా సుఖమయమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి..’ అన్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నారా? అని ప్రశ్నించగా.. ‘వెళ్తున్నాను.. వెళ్లకూడదా? పిలిస్తే వెళతాం కదా.. ఎందుకు వెళ్లం?’ అని ఎదురు ప్రశ్నించారు. -
ఒక్క క్లిక్‌తో ఇంటికి అనుమతి
సరళ పద్ధతుల్లో నూతన భవన నిర్మాణ పాలసీ జీహెచ్ఎంసీపై సమీక్ష అనంతరం మంత్రి తలసాని హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర సంస్థల నుంచి పొందాల్సిన అనుమతులు, అధికారులకు ‘ఆమ్యామ్యాలు’ వంటి దశలను దాటితేగానీ మహాయజ్ఞం లాంటి ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం సాధ్యంకావట్లేదు. ఈ దుస్థితి లేని వ్యవస్థ అందుబాటులోకి వస్తే... అధికారులకు చేయి తడపాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క మౌస్ క్లిక్‌తో క్షణాల్లో గృహ నిర్మాణానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో సరళ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తోంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణతోపాటు నూతన భవన నిర్మాణ పాలసీ రూపకల్పన అంశంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో నూతన భవన నిర్మాణ పాలసీపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో భవన నిర్మాణ అనుమతులన్నీ వచ్చేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం అమలు చేస్తున్న ‘టీఎస్-ఐపాస్’ విధానం తరహాలోనే భవన నిర్మాణ విధానం ఉంటుందన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నగరంలో చాలా అక్రమ కట్టడాలున్నాయని, నాలాలపైనా నిర్మాణాలున్నాయని, దేవాలయస్థలాలను సైతం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని కన్జర్వేటివ్ జోన్లో అనుమతులు లేకపోయినా నిర్మాణాలు జరిగాయన్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో తప్పులు పునారావృతం కాకుండా ఉండేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసేలా నూతన పాలసీ ఉంటుందన్నారు. దీని ద్వారానే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు జరిగితే ఆ ప్రాంత అధికారినే బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరానికి ఇప్పటికే రూ. 230 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటికి ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీద చెత్త పారబోయకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతీ ఇంటికీ రెండు డస్టుబిన్లు ఇవ్వనున్నట్లు తలసాని చెప్పారు. పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రణాళికపై తమ కమిటీ సెప్టెంబర్ 1న మరోసారి సమావేశమై నెల రోజుల్లో సీఎం కే సీఆర్‌కు నివేదిక ఇస్తుందన్నారు. జీవో 111కు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, అక్కడ కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమస్యలకు ఇక చెక్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పలు సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకూ ఇంటిని నిర్మించాలంటే ఈ పాట్లన్నీ పడాల్సి వచ్చేది. నగర పాలక సంస్థ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి విధిగా పొందాలి. ఇందుకు ఇళ్లు నిర్మించాల్సిన స్థలం తాలూకా అన్ని లింక్ డాక్యుమెంట్లను సమర్పించాలి. అంతేకాదు టౌన్‌ప్లానింగ్ అధికారుల తనిఖీలు, వాళ్లకుఇవ్వాల్సిన ‘మామూళు’్ల షరామామూలే. డాక్యుమెంట్లన్నీ సరిగానే ఉన్నా...మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. నిర్మాణ అనుమతికి లోబడి మాత్రమే భవనంలో అంతస్తులు నిర్మించాలి. విద్యుత్,మంచినీటి కనెక్షన్ పొందాలంటే లింక్ డాక్యుమెంట్లు, సేల్డీడ్లు తప్పనిసరి. బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలంటే ఫైర్‌సేఫ్టీ అనుమతులు, సెట్బ్యాక్లు(భవంతి చుట్టూ ఖాళీస్థలాలు) తప్పనిసరి. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం మించిన భవనానికి సంబంధించిన స్థలంలో నిర్మాణ వైశాల్యంలో పదిశాతం స్థలాన్ని మున్సిపాల్టీకి తనఖా పెట్టాలి. టౌన్‌ప్లానింగ్ అనుమతుల ప్రకారమే ఇంటిని నిర్మించినట్లు ధ్రువీకరిస్తేనే భవంతి నిర్మాణం తరవాత ఆక్యుపెన్సీ ధ్రువీకరణ మంజూరు చేస్తారు.గృహనిర్మాణ అనుమతికి దరఖాస్తుతోపాటు రూ.10 వేలు డీడీని సమర్పించాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి అనుమతులకు చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది. ఇంటిని నిర్మిస్తున్న లేఅవుట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్)ధ్రువీకరణ ఉంటేనే ఇంటిరుణం దొరికే పరిస్థితి ఉంది. గతంలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన వారు ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాల ప్రకారం బిల్డింగ్ పీనలైజేషన్(బీపీఎస్) పథకం కింద భవంతిని క్రమబద్దీకరించుకోవాలి. పదిమీటర్ల ఎత్తుకు మించిన భవనానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవీ... భవన నిర్మాణ దరఖాస్తుపై ఇంటి యజ మాని సంతకం, బిల్డర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల సంతకాలు. ఓనర్ డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్. భవన ఆర్కిటెక్ట్ లేదా ఇంజ నీర్ లెసైన్సు కాపీ. ఎమ్మార్వో జారీ చేసే టౌన్ సర్వే రికార్డు. గతంలో జారీచేసిన అనుమతి పత్రం. వెయ్యి చదరపు మీటర్లు దాటిన భవంతికి యూఎల్సీ క్లియరెన్స్. వెయ్యి చదరపు మీటర్ల లోపలున్న భవంతికి యూఎల్సీ అఫిడవిట్. ఓనర్షిప్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు. రూ. 20 నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్. భవన నిర్మాణ ప్లాన్. -
బోనాలకు సర్వం సిద్ధం : మంత్రి తలసాని
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే నెల 2,3 తేదీల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా సాంస్కృతికశాఖ తరఫున అక్కడక్కడా ప్రత్యేక స్టేజ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. -
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
తలసాని ఇంటిముందు ధర్నా చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతల అరెస్టు తీగల, మంచిరెడ్డి ఇళ్లకు వెళ్లకముందే నాయకుల అరెస్టు హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని గురువారం రాత్రి మహబూబ్‌నగర్ సభ అనంతరం పార్టీ నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ప్లీనరీకి వెళ్లిన తరువాత వారిళ్ల ముందు ధర్నాలు చేయడం వల్ల పోలీసులు అడ్డుకోలేరని పార్టీ నేతలు భావించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే విషయం ముందే తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం, టీఎన్ఎస్ఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివసించే మారేడ్‌పల్లి ఇంటికి ఉదయం వెళ్లిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్ చంద్రతో పాటు పలువురు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటి బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివసించే తిరుమల హిల్స్‌కు వెళ్లేందుకు ఆ నియోజకవర్గం ఇన్చార్జి వీరేంద్రగౌడ్, ఆయన అనుచరులు బయలుదేరగా మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లేందుకు తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితర మహిళా నాయకులు ప్రయత్నించగా, వారిని కూడా ఇంటికి వెళ్లకముందే అరెస్టు చేశారు. టీడీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు సి. కృష్ణయాదవ్ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారిని విడుదల చేయించారు. మలక్‌పేటలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే పోలీ సులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని శోభారాణి విమర్శించారు. -
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని గురువారం రాత్రి మహబూబ్‌నగర్ సభ అనంతరం పార్టీ నేతలు నిర్ణయించారు. విషయం ముందే తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం, టీఎన్ఎస్ఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటికి ఉదయం వెళ్లిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్ చంద్రతో పాటు పలువురు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటి బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివసించే తిరుమల హిల్స్‌కు వెళ్లేందుకు ఆ నియోజకవర్గం ఇన్చార్జి వీరేంద్రగౌడ్, ఆయన అనుచరులు బయలుదేరగా మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లేందుకు తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితర మహిళా నాయకులు ప్రయత్నించగా, వారిని కూడా ఇంటికి వెళ్లకముందే అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యేలు ఇళ్ల వద్ద లేని సమయంలో ధర్నాలు చేసే కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల పార్టీ నేతలే పెదవి విరిచారు.