మత్స్యకారుల అభ్యున్నతికి రూ.101 కోట్ల బడ్జెట్‌ | Rs 101 Crores to the welfare of the fishermens | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల అభ్యున్నతికి రూ.101 కోట్ల బడ్జెట్‌

Published Sat, Dec 31 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

మత్స్యకారుల అభ్యున్నతికి రూ.101 కోట్ల బడ్జెట్‌

మత్స్యకారుల అభ్యున్నతికి రూ.101 కోట్ల బడ్జెట్‌

అసెంబ్లీలో మంత్రి తలసాని వెల్లడి

- గ్రామాల్లోని ప్రతి చెరువు, అన్ని రిజర్వాయర్లలో చేపల పెంపకం
- రాష్ట్రంలో 100 రిటైల్‌ చేపల మార్కెట్ల నిర్మాణానికి చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి తమ ప్రభుత్వం అధిక బడ్జెట్‌ను కేటాయించిందని, రూ. 101 కోట్లు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలి పారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమాభివృద్ధిపై శుక్రవారం అసెంబ్లీలో లఘు చర్చ సందర్భం గా మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య పరి శ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామం లో చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకా నికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.36.35 కోట్ల అంచనా వ్యయంతో 40.39 కోట్ల చేప పిల్లలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 74 రిజర్వాయర్లు, 4,324 శాఖాపరమైన చెరువులు, 19,746 గ్రామ పంచాయతీ చెరు వుల్లో వీటిని పెంచనున్నట్లు మంత్రి వివరిం చారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, జాతీయ మత్య్స పరిశ్రమాభివృద్ధి బోర్డు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కింద రాష్ట్రంలో 33 చేపల రిటైల్‌ మార్కెట్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 100 రిటైల్‌ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వాటికి స్థలాలను గుర్తించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, మత్స్యశాఖ అధికారులకు సూచించినట్లు తెలి పారు. ఎమ్మెల్యేలు కూడా ఇందుకు స్థలాలను సూచించాలని వెల్లడించారు. ఇక టోకుగా చేపల మార్కెటింగ్‌ను పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న మధ్యవర్తుల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నగదు రహిత లావాదేవీలు
రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని 11 రిటైల్‌ కేంద్రాల ద్వారా చేపల విక్రయాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులోని 9 కేంద్రాల్లో నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 3,977 మత్స్య సహకార సంఘాలలో 3,26,154 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారుల సహకార సంఘాలలో అర్హులైన అందరికి సభ్యత్వం కల్పించేందుకు, కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. 100 శాతం గ్రాంటుతో చేప పిల్లల సరఫరా కోసం రూ.48.35 కోట్లను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. మత్స్యకారులకు మెరుగైన ధరలు లభించేందుకు మార్కెట్ల అనుసంధానం, కొనుగోలుదారులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం స్పీకర్‌ సభను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున తదుపరి చర్చ కొనసాగుతుందని ప్రకటించారు.

సీఎం రెండడిగితే నాలుగిస్తారు
సాక్షి, హైదరాబాద్‌: ‘మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండడిగితే నాలుగిస్తారు. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు లీటరుకు రూ. 2 ప్రోత్సాహకం కోరగా.. సీఎం ఏకంగా రూ. 4 ఇస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు’ అని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. పశు వైద్య అధికారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయంలో 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక, మత్స్యశాఖలు పనికి మాలినవిగా గతంలో అనుకునే వారని.. కానీ వీటి ప్రాముఖ్యతను సీఎం గుర్తించారన్నారు. పశుసంవర్ధక శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారన్నారు. గోపాలమిత్రలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నాటికి సంచార వైద్య శాలలను ప్రతీ నియోజకవర్గంలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అలాగే రూ. 400 కోట్ల జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) రుణం మంజూరైందన్నారు. 462 వెటర్నరీ కాంపొండర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

‘పడమటి సంధ్యారాగం లండన్‌లో’ చిత్ర పరిచయం
గణేష్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై లండన్‌ గణేష్‌ నిర్మాతగా, వంశీ మునిగంటి దర్శకుడిగా ‘పడమటి సంధ్యారాగం లండన్‌లో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాన్ని మంత్రి తలసాని సచివా లయంలో విలేకరుల ముందు పరిచయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement