
ధర్మపురి: టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత కూలీ పని చేశారు. ఓ రైస్ మిల్‌లో మూటలు మోశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవితలు మంగళవారం వచ్చారు. వీరు ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో బియ్యం మూటలు మోసారు. ఇందుకు తలసాని, కవిత రూ. 50 వేలు సంపాదించారు.
