gulaabi cooli dinalu
-
రేవంత్‌రెడ్డి ఫిర్యాదు అందిందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’పేరుతో పెద్ద మొత్తాల్లో డబ్బు వసూలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అందిందో? లేదో? చెప్పాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదు అందితే, అది ఎప్పుడు అందింది.. దానిని జనరల్ డైరీ (జీడీ)లో ఎప్పుడు నమోదు చేశారు.. అసలు నమోదు చేశారో? లేదో? చెప్పాలంది. ఒకవేళ జీడీ డైరీలో కూడా నమోదు చేసి ఉంటే ఆ ఫిర్యాదుపై ఏం చేశారో తెలియజేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకే వస్తుందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ జరిపారు. -
మూటలు మోసిన కవిత
ధర్మపురి: టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత కూలీ పని చేశారు. ఓ రైస్ మిల్లో మూటలు మోశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవితలు మంగళవారం వచ్చారు. వీరు ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో బియ్యం మూటలు మోసారు. ఇందుకు తలసాని, కవిత రూ. 50 వేలు సంపాదించారు. -
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మారు. అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ జ్యూస్, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బాల్క సుమన్, వివేకానంద, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఆనంతరం అక్కడి బస్తీవాసులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను, ప్రజలను కోరారు. కాగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 21న టీఆర్ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్ మరో రెండు రోజులు నగరంలో కూలీ పనులు చేయనున్నారు.