ప్రజల సంక్షేమం పట్టని కాంగ్రెస్‌ | Minister talasani comments on congress | Sakshi
Sakshi News home page

ప్రజల సంక్షేమం పట్టని కాంగ్రెస్‌

Published Thu, May 25 2017 5:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ప్రజల సంక్షేమం పట్టని కాంగ్రెస్‌ - Sakshi

ప్రజల సంక్షేమం పట్టని కాంగ్రెస్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 
 
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్‌పార్టీ నేతలు ఏ రోజూ ప్రజల సంక్షేమం గురించి పట్టించు కోలే దని రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బుధ వారం వనపర్తిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గొర్రెలకాపరుల అవగాహన కార్యక్ర మంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలస జిల్లాగా పేరున్న ఉమ్మడి పాలమూరు లో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలి పారు. గొల్ల, కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ వాటిని శాశ్వతంగా దూరం గా చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. పంచాయతీరాజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోం దన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement