
చెక్కు తిరిగిస్తున్న మంత్రి తలసాని
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో తమ కుటుంబానికి ఉన్న 20 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి అందజేసిన రూ.81 వేల రైతు బంధు చెక్కులను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తిరిగి ఇచ్చారు.
కొల్తూరులో శనివారం జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి తలసాని తమ చెక్కులను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డికి అందజేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి రైతు బంధు చెక్కులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కొల్తూరుకి చెందిన 600 మంది రైతులకు రూ.78.12 లక్షలకు సంబంధించిన 714 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment