పశువీర్య ఉత్పత్తికి బ్రెజిల్ టెక్నాలజీ: తలసాని
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పశు వీర్య ఉత్పత్తి కేంద్రానికి బ్రెజిల్‌లో అమలవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. పశు గణాభివృద్ధి, కళలు తదితర రంగాల్లో బ్రెజిల్‌తో కలసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు త్వరలో బ్రబెజిల్‌తో ఎంవోయూ కుదుర్చుకొంటామన్నారు.సచివాలయంలో మంగళవారం తలసానితో బ్రెజిల్ వ్యవసా య మంత్రి జోడో క్రూస్ రైస్ ఫిలాహో బృందం సమావేశమైంది.
తలసాని మాట్లాడుతూ.. బ్రెజిల్‌లో 21 కోట్ల జనాభా ఉండగా అదే మొత్తంలో పశుసంపద ఉందన్నారు. మన దేశ పశు జాతులైన ఒంగోలు, గిర్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా బ్రెజిల్ పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. రాష్ట్రంలో పశు గణాభివృద్ధికి, గొర్రెలు, మేకల పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని బ్రెజిల్ ప్రతినిధి బృందానికి వివరించినట్లు చెప్పారు.