గడ్డాలు పెంచుకున్నా అధికారం రాదు | Minister talasani comments on congress leaders | Sakshi
Sakshi News home page

గడ్డాలు పెంచుకున్నా అధికారం రాదు

Published Sat, Jun 10 2017 12:38 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Minister talasani comments on congress leaders

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఫైర్‌
 
పరిగి: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆ పార్టీలో ఉన్నవారంతా గడ్డాలు పెంచుకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ మేమే అధికారం చేపడతాం’ అని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం పరిగిలో గొల్ల కురుమల ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలో 6.5 లక్షల మంది లబ్ధిదారులకు 1.3 కోట్ల గొర్రెలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గతంలో జరిగిందంతా దొంగల పాలనేనని అన్నారు.  

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఓ అబద్ధాల కోరని, కొడంగల్‌ పొట్టి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సూట్‌కేసులు తీసుకెళ్లి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగ అని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement