
సమావేశంలో పాల్గొన్న మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల, కేటీఆర్, ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక స్వయం ప్రతి పత్తిగల రోడ్డు భద్రత సంస్థ ఏర్పాటు అవ సరమని ఆ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. కాలు ష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉన్న ట్టుగానే రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొంది. దీనికి విధివిధానాలతో కూడిన ప్రతిపాదన సిద్ధం చేసి సీఎం పరిశీలనకు పంపనున్నట్టు వెల్లడించింది. సోమవారం ఉపసంఘం సభ్యులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు మాదాపూర్‌లోని ‘న్యాక్’ భవనంలో సమావేశమై సమీక్షిం చారు.
గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా పరిస్థితి ఇప్పటికీ ఆందోళనక రంగానే ఉందని, పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఆధునిక వాహనాలు అందుబాటు లోకి రావటం, రోడ్ల వెడల్పు తదితర కార ణాల వల్ల వాహనాల వేగం పెరిగి ప్రమాదాలను పెంచుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు. దీంతో ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లు, నిరంతర నిఘా, ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ అవసరముందని కమిటీ అభి ప్రాయపడింది.
పాఠ్యాంశాల్లో చేర్చేలా...
కేరళ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తక్కువగా నమోదవుతున్న దృష్ట్యా అక్కడి పరిస్థితులపై ఇటీవల అధికారుల బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఆ నివేదికనూ మంత్రుల కమిటీ పరిశీలించింది. చిన్న రాష్ట్రమైన కేరళను చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదని, రోడ్డు భద్రత పటిష్టంగా ఉన్న స్వీడన్ లాంటి దేశాలతో పోటీపడేలా మనం పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పడే సంస్థకు స్వయం ప్రతి పత్తితోపాటు ప్రత్యేక నిధి కూడా ఉండాల్సి ఉంటుందని, దీనికి చట్టబద్ధత కల్పించేందుకు వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ప్రతిపాదనను సీఎంకు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు విధించే జరిమానా మొత్తాన్ని కూడా ఈ సంస్థకే కేటాయించాలని కూడా అభి ప్రాయపడ్డారు.
ఇక ప్రజా రవాణాకు ప్రజలు ప్రాధాన్యమిచ్చేలా ఆ వ్యవస్థను తీర్చి దిద్దాల్సిన అవసరముందని, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరిగేలా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బోధన అవసరమని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించే తరహాలో వాహనాల తయారీ, నిబంధనలు బేఖాతరు చేసేవారికి భారీ జరి మానాల విధింపు, పర్యావరణ అనుకూల విధానాలను ప్రవేశపెట్టడం,ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకోవటం, లైసెన్స్ జారీలో అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానాల అమలు తదితర అంశాలపై కూడా చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, రైల్వే పోలీసు డీజీ కృష్ణ ప్రసాద్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆర్‌ఓ కృష్ణప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు, రవాణాశాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.