ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్న సజ్జల, మంత్రులు బొత్స, ఆదిమూలపు
సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) చాలా మెరుగైందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. దానిపై చర్చించాలని మరోసారి ఉద్యోగ సంఘాలను కోరింది. సీపీఎస్ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) ప్రభుత్వం తట్టుకునే పరిస్థి తి లేదని, సీపీఎస్ వల్ల ఎలాంటి భద్రత లేదని చెప్పారు.
అందుకే మధ్యేమార్గంగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిగురించి లోతుగా చర్చించి ఇంకా మెరుగుపరిచేందుకు సల హాలివ్వాలని నేతలను కోరారు. జీపీఎస్ తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవుదామని మంత్రులు, ప్రభుత్వ సలహాదారు చెప్పారు.
పీఆర్సీకి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్య లు తీసుకుంటామని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ ణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment