ఈ ఏడాది నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టు
మంత్రివర్గ ఉపసంఘం ప్రకటన
చెన్నైలో అమ్మ క్యాంటీన్ల పరిశీలన
చెన్నై : ఈ ఏడాది నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో నాలుగు జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిపై అవగాహనకు చెన్నైలోని రెండు అమ్మ క్యాంటీన్లను మంత్రులు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురం, తిరుపతిలలో ఐదేసి చొప్పున అన్న క్యాంటీన్లను తొలివిడతగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.