
వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి
గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నల్లపాడురోడ్డులో వేదిక వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షకు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు భారీ ఎత్తున తరలిరానున్నారు.