చంద్రబాబుపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.