
సాక్షి, చిత్తూరు: అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తన మనుషులకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, అదే తమ ప్రభుత్వ థ్యేయమని అన్నారు.
చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే
‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!